ETV Bharat / bharat

లద్దాఖ్‌లో చైనా వాహనాలు!

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ డ్రాగన్​ దేశానికి చెందిన రెండు వాహనాలు లద్దాఖ్​లో కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అయ్యింది. ఇటీవలే ఈ ఘటన జరిగిందని లద్దాఖ్‌ అభివృద్ధి మండలి ప్రతినిధి ఇషే స్పాల్‌జంగ్‌ 'ఈటీవీ భారత్‌'కు తెలిపారు.

Chinese vehicles present at  Changthang area of Nyoma block in Ladakh's Leh district emerged on Sunday
లద్దాఖ్‌లో చైనా వాహనాలు!
author img

By

Published : Dec 21, 2020, 9:03 AM IST

Updated : Dec 21, 2020, 9:15 AM IST

లద్దాఖ్‌లో చైనా వాహనాలు!

పొరుగు దేశం చైనాకు చెందిన రెండు వాహనాలు లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో కనిపించడం కలకలం రేకెత్తించింది. సంబంధిత వీడియోపై చిత్రీకరించిన తేదీ లేకపోయినా కొద్దిరోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని లద్దాఖ్‌ అభివృద్ధి మండలి ప్రతినిధి ఇషే స్పాల్‌జంగ్‌ ‘'ఈటీవీ భారత్‌'’కు ఫోన్​లో తెలిపారు.

స్థానిక సంచార జాతులవారు పశువులను మేపడానికి చాంగ్‌తాంగ్‌ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చైనా బలగాలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. చైనా వాహనాలు మన భూభాగంలోకి వచ్చి, స్థానికులతో వాగ్వాదం తర్వాత వెనుదిరుగుతున్నట్లు వీడియోలో ఉంది. దీనిపై భారత సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి : చైనా సరిహద్దుల్లో ఆయుధ నిల్వ సామర్థ్యం పెంపు

Last Updated : Dec 21, 2020, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.