ETV Bharat / bharat

సరిహద్దులో చైనా కొత్త నిర్మాణాలు- నేపాల్ వత్తాసు!

author img

By

Published : Sep 17, 2020, 1:45 PM IST

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా కొత్త నిర్మాణాలు చేపడుతోంది. నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఈ నిర్మాణాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చైనా కార్యకలాపాలపై భద్రతా దళాలు నిఘా పెడుతున్నాయని స్పష్టం చేశారు. అటు.. చైనాతో పాటు నేపాల్ సైతం సరిహద్దులో భద్రత పెంచుకుంటోంది. లిపులేఖ్ ప్రాంతంలో బలగాలను మోహరించింది.

Chinese construction activities observed near Uttarakhand border
సరిహద్దులో చైనా కొత్త నిర్మాణాలు- నేపాల్ వత్తాసు!

లద్దాఖ్​లో భారత సైన్యంతో ఘర్షణకు దిగుతున్న చైనా.. ఉత్తరాఖండ్​ సరిహద్దులో కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నేపాల్​లోని టింకర్-లిపు పాస్​కు దగ్గర్లో గుడిసెలు వంటి నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది. టింకర్ లిపు పాస్​కు 8 కి.మీ దూరంలో ఉన్న జొజో గ్రామంలోని చంపా మైదానంలోనూ నిర్మాణాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్ సరిహద్దుల వెంబడి చైనా చేపట్టిన తాజా కార్యకలాపాలపై భారత భద్రతా సంస్థలు నిఘా ఉంచాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నేపాల్ సరిహద్దు కలిసే ప్రాంతంలో చైనా పీఎల్​ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

రంగంలోకి నేపాల్!

మరోవైపు లిపులేఖ్ ప్రాంతంలో భారత సైన్యం కదలికలను నిశితంగా పరిశీలించాలని నేపాల్ ప్రభుత్వం తన భద్రతా దళాలను ఆదేశించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 'నేపాల్ సాయుధ పోలీస్ దళం(ఎన్​ఏపీఎఫ్)'కు ఆ దేశ హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాయి. లిపులేఖ్ ప్రాంతంలో 44 బెటాలియన్ల ఎన్​ఏపీఎఫ్ బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి. లిపులేఖ్ అంశంలో నేపాల్​తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

భద్రత పెంచుకుంటున్న చైనా

అటు చైనా కూడా లిపులేఖ్ ప్రాంతంలో భద్రతను పెంచుకుంటోంది. 150 లైట్ కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్ దళాలను మోహరించినట్లు తెలిసింది. ఈ బలగాలు ఆగస్టులోనే ట్రైజంక్షన్​కు చేరుకున్నట్లు సమాచారం. భారత సరిహద్దుకు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాలా ప్రాంతంలో ఉన్న బలగాలతో వీరు కలిసినట్లు తెలుస్తోంది.

రహదారి నిర్మాణాలు

చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్​ సైతం దూకుడు పెంచింది. ఉత్తరాఖండ్ చమోలిలో మౌలిక సదుపాయాల కల్పనను సరిహద్దు రహదారి సంస్థ(బీఆర్​ఓ) వేగవంతం చేసింది. సైనికులను తక్కువ సమయంలోనే సరిహద్దుకు చేర్చేందుకు ఉపయోగపడే రహదారి నిర్మాణం పూర్తి చేసింది. భారత్​లోని చిట్టచివరి చెక్​పాయింట్​ అయిన రిమ్​ఖిమ్​ను ఈ రహదారి కలుపుతుంది.

Chinese construction activities observed near Uttarakhand border
పూర్తయిన రహదారి నిర్మాణం

అదే సమయంలో గ్యాల్దగ్ చెక్​పోస్ట్ నుంచి నీతి పాస్​లోని లోయ వరకు నిర్మిస్తున్న రహదారి పనులు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న రహదారి పనులు

ఇదీ చదవండి- 'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.