ETV Bharat / bharat

ఆ ఐదుగురిని భారత్​కు అప్పగించిన చైనా - arunachal pradesh youth abducted

అరుణాచల్​ ప్రదేశ్​ యువకులను అపరహరించిన చైనా ఎట్టకేలకు విడిచిపెట్టింది. ఐదుగురు యువకులను చైనా తిరిగి అప్పగించినట్టు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అప్పగింత ప్రక్రియ శనివారం ఉదయం చైనా భూభాగంలో జరిగింది.

youth china
అరుణాచల్​
author img

By

Published : Sep 12, 2020, 12:53 PM IST

అపహరణకు గురైన ఐదుగురు భారతీయ పౌరులను చైనా ఎట్టకేలకు విడిచిపెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఈ వేటగాళ్లు సెప్టెంబరు 4నుంచి కనిపించకుండా పోయారు. పొరబాటున సెప్టెంబర్‌ 2న వాస్తవాధీన రేఖను దాటివెళ్లిన వారిని శనివారం చైనా తిరిగి అప్పగించినట్టు భారత భద్రతా దళాలు ప్రకటించాయి.

అప్పగింత ప్రక్రియ శనివారం ఉదయం చైనా భూభాగంలో జరిగింది. విడుదలైన వారు కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు చేరుకునేందుకు సుమారు గంట సమయం పడుతుంది.

ఏం జరిగింది?

ఇండో టిబెటన్‌ భద్రతా దశాలు స్థానికులను సహాయకులుగా, గైడ్లుగా వినియోగించుకుంటాయి. తమకు అవసరమైన సామగ్రిని, మెక్‌ మోహన్‌ రేఖ వెంబడి ఉన్న సైనిక స్థావరాలకు చేర్చేందుకు కూడా వీరి సహాయం తీసుకుంటాయి. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి చెందిన కొందరు దారి తప్పిపోయారు. సరిహద్దుల వెంట వారిని చైనా సైన్యం అపహరించింది.

వారు కనపించకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సంప్రదించగా.. చైనా భద్రతాదళం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తొలుత తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించింది. అనంతరం వారు తమ ఆధీనంలోనే ఉన్నట్టు మంగళవారం ప్రకటించింది.

భారత్ మానవతా దృష్టి..

ఇదే విధంగా దారితప్పి భారత భూభాగంలోకి వచ్చిన చైనీయుల పట్ల భారత రక్షణ దళాలు మానవతా దృష్టితో వ్యవహరించటమే కాకుండా.. వారికి వెచ్చని దుస్తులు, ఆహారం అందించి మరీ తిరిగి వెళ్లేందుకు తోవ చూపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై మరింత విమర్శలకు గురి అవుతామనే ఆలోచనతోనే చైనా దిగివచ్చినట్టు పలువురు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.