కర్ణాటక బెల్గాంకు చెందిన భారతి బస్తవద్కర్ అనే మహిళ అంతమసంస్కారాలు చేయడానికి ఆమె కుమారులకు మూడు రోజుల సమయం పట్టింది. అనారోగ్యం కారణంగా భారతి ఈ నెల 16న బిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో సరైన వైద్యం అందక మరణించింది.
కరోనా లాక్డౌన్ కారణంగా ఆమె కుమారులు ఇరువురూ నిరుద్యోగులుగా మారారు. దీంతో వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆసుపత్రికి ఫీజు కట్టలేకపోయారు. తెలిసిన వారి దగ్గర అడిగినా ఫలితం లేకపోయింది. మొత్తం చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది అనడంతో మూడు రోజుల పాటు వేచి చూశారు ఆ కుమారులు.
ఈ తరుణంలో అన్నదమ్ముల బాధను గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ సాయం చేసింది. చివరకు మూడు రోజుల తర్వాత దహన సంస్కారాలు చేశారు.