ETV Bharat / bharat

దేశంలో ఈసురోమంటున్న బాల్యం

దేశంలో పౌష్టికాహార సంక్షోభంతో చిన్నారులు ఎలా బాధపడుతున్నారో కళ్లకు కట్టినట్లు తన నివేదికలో తెలిపింది సమగ్ర జాతీయ పోషకాహార సంస్థ. అయిదేళ్లలోపు పిల్లల్లో 35 శాతం గిడసబారిపోతున్నట్లు, 17 శాతం బాలల్లో ఎత్తుకు తగ్గ బరువు కొరవడినట్లు పేర్కొంది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరచి పౌష్టికాహార లోపంపై యుద్ధం చేయవలసిన తరుణమిదని జాతీయ పోషకాహార సంస్థ ఉద్ఘాటించింది.

దేశంలో ఈసురోమంటున్న బాల్యం
author img

By

Published : Oct 12, 2019, 3:14 PM IST

దేశంలో పౌష్టికాహార సంక్షోభం ఎలా చిలవలు పలవలు వేసుకుపోయిందో, బాలభారతం ఎంతగా గుక్కపెడుతోందో సమగ్ర జాతీయ పోషకాహార అధ్యయన వివరాలు కళ్లకు కడుతున్నాయి. నవజాత శిశువులు మొదలు తొమ్మిదేళ్ల వరకు బాలలు, 10-19 ఏళ్ల మధ్య కౌమార దశలోనివారిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలు ‘యునిసెఫ్‌’ నిపుణుల తోడ్పాటుతో 2016 ఫిబ్రవరి, 2018 అక్టోబరు నడుమ నిర్వహించిన విస్తృత సర్వే ఎన్నో దిగ్భ్రాంతకర యథార్థాలను క్రోడీకరించింది. ముప్ఫై రాష్ట్రాలకు చెందిన సుమారు లక్షా 12 వేలమంది నుంచి రక్త, మూత్ర నమూనాలు రాబట్టి ఏ, బీ12, డీ విటమిన్లు, అయోడిన్‌, జింక్‌, ఫోలేట్‌, ఇనుపధాతు లోపాలపై చేపట్టిన భూరి కసరత్తు- రేపటి పౌరుల ఆరోగ్యచిత్రం ఛిద్రమవుతున్నట్లు నిర్ధారించింది.

అయిదేళ్లలోపు పిల్లల్లో 35 శాతం గిడసబారిపోతున్నట్లు, 17 శాతం బాలల్లో ఎత్తుకు తగ్గ బరువు కొరవడినట్లు తాజాగా వెల్లడైంది. బరువు తక్కువ పిల్లల జాబితాలో ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ ముందున్నాయి. బిహార్‌, మధ్యప్రదేశ్‌లతోపాటు యూపీ, రాజస్థాన్లలో ఎదుగుదల మందగించినవారి సంఖ్య అధికంగా ఉంది. అయిదు నుంచి పందొమ్మిదేళ్ల లోపువారిలో 10 శాతం, మధుమేహం దాపురించే ముప్పు ఎదుర్కొంటున్నారు. ఏడు శాతానికి పైగా పిల్లలు మూత్రపిండ వ్యాధుల పాలబడినట్లు, పలువురిని ఊబకాయం సమస్య పీడిస్తున్నట్లు చాటిన అధ్యయనం- ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.

2030నాటికి దేశంలో టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరుతుందన్న పాత అంచనాలను సరిదిద్దుకోవాల్సిన ప్రమాదాన్ని పోషకాహార సంక్షోభం సూచిస్తోంది. ఇప్పటికే క్షయ, మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీవ్యాధుల నివారణలో వెనకబాటు- ఆరోగ్యసూచీల్ని కుంగదీసి అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠకు తూట్లు పొడుస్తోంది. రేపటి పౌరుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు నేరుగా పూచీపడాల్సిన ప్రజాప్రభుత్వాలు తక్షణం మేలుకొనకపోతే, పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతుంది!

అభివృద్ధి అజెండాలో పౌష్టికాహారానికి పెద్దపీట వేయాలంటూ ‘నీతి ఆయోగ్‌’ రెండేళ్ల క్రితం జాతీయ విధానాన్ని విడుదల చేసి, మౌలిక సమస్యల్ని ప్రస్తావించింది. 14-49 ఏళ్ల మహిళల్లో సగానికంటే ఎక్కువమందిని రక్తహీనత సమస్య పీడిస్తోంది. రక్షిత మంచినీరు కొరవడి పిల్లల్లో అధికులు డయేరియా, నులిపురుగుల బారిన పడుతున్నారు. పర్యవసానంగా పోషహాకార లోపాలు చుట్టుముడుతున్నట్లు అప్పట్లో నీతి ఆయోగ్‌ స్పష్టీకరించింది.

నేటికీ మధ్యప్రదేశ్‌లోని నాలుగేళ్లలోపు పిల్లల్లో 54 శాతం రక్తహీనతతో కృశిస్తుండటం- దిద్దుబాటు చర్యలు దస్త్రాలకే పరిమితమైన వైనాన్ని ధ్రువీకరిస్తోంది. జాతీయ సగటు లెక్కిస్తే- రెండేళ్లలోపు పిల్లల్లో కనీస సమతులాహారం పొందుతున్నవారు ఏడు శాతానికి మించరన్న నిర్ధారణ నిశ్చేష్టపరచేదే. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అసోం, ఝార్ఖండ్‌లు జాతీయ సగటుకన్నా మెరుగనిపించుకోగా- ఆంధ్రప్రదేశ్‌ (1.3శాతం), తెలంగాణ (3.6శాతం), మహారాష్ట్ర (2.2) వంటివి అధ్వాన రికార్డులు నమోదు చేశాయి. వెనకబాటుతనానికి మారుపేరుగా పరువుమాసిన ‘బిమారు’ (బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ) రాష్ట్రాలే సకల బాలారిష్టాలకూ కేంద్ర బిందువులని నీతి ఆయోగ్‌ ఇటీవల సూటిగా తప్పుపట్టింది.

సరైన పోషకాలందక బాల్యం బక్కచిక్కితే, అనంతర కాలంలో శారీరక మానసిక వికాసం మందగించి తరచూ అనారోగ్యం వేధించే ముప్పుందని ఎందరో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ మహా ప్రమాదమిప్పుడు ‘బిమారు’ రాష్ట్రాలకే పరిమితం కాలేదంటున్న సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ఉద్బోధను ప్రభుత్వాలిక ఎంతమాత్రం ఉపేక్షించే వీల్లేదు. భావిపౌరుల్ని మందకొడితనం ఆవరిస్తే మున్ముందు వారి ఉత్పాదక సామర్థ్యం క్షీణించి దేశార్థికం నీరసిస్తుందన్న విశ్లేషణల దృష్ట్యా- పోషకాహార వ్యూహాల్ని సత్వరమే సాకల్యంగా సమీక్షించాల్సి ఉంది.

మాతాశిశు సంరక్షణ, పౌష్టికాహార పంపిణీ, వ్యాధుల నుంచి సంరక్షణలకు ఉద్దేశించిన పథకాలు లెక్కకు మిక్కిలిగా దేశంలో అమలవుతున్నాయి. అయితేనేం- పసితనానికి ఇక్కడ ఆలనాపాలనా కరవేనని లోగడ ప్రపంచ పోషకాహార సంస్థ నివేదిక తీవ్రంగా ఆక్షేపించింది. వాస్తవానికి సమతులాహారంపై అశ్రద్ధ కారణంగా 70 శాతం భారతీయులకు కండరపుష్టి లేకుండాపోతోంది. అమెరికా, ఐరోపాలతో పోలిస్తే దేశీయంగా పిల్లలు 40 రెట్లు అధికంగా ‘విషాహారం’ సేవిస్తున్నారని ఆమధ్య జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) స్వయంగా నిర్ధారించింది.

పోషకాహార లోపాలు, బరువు తక్కువ పిల్లలు, రక్తహీనత తదితరాలన్నీ ‘ప్రతిష్ఠాత్మక’ ఐసీడీఎస్‌ (సమీకృత శిశు అభివృద్ధి పథకం) ఘోరవైఫల్యానికి ప్రబల సూచికలు. అంగన్‌వాడీ కేంద్రాల నాసి పనితీరు, పర్యవేక్షణ లోపాలు- ప్రపంచంలోనే అతిపెద్ద శిశు పోషకాహార పథకాన్ని గుల్లబారుస్తున్నాయి. రొట్టెల్లో నంజుకోవడానికి ఉప్పు వడ్డిస్తున్న ఇటీవలి ఉదంతాలు, దేశంలో పలుచోట్ల మధ్యాహ్న భోజన పథకం గతిరీతులకు నిదర్శనలు. అటువంటి కంతలు పూడ్చకుండా ఎదుగుదల లోపాల్ని ఏటా మూడు శాతం వంతున తగ్గించాలని, బాలలూ కౌమార ప్రాయంలోనివారి రక్తహీనతను ఫలానా గడువులోగా మూడోవంతు మేర అరికట్టాలని... లక్ష్యాలెన్ని నిర్దేశించుకున్నా నికరంగా ఒరిగేదేముంది?

శిశు సంక్షేమ, ఆహార పథకాల్లో లొసుగుల్ని అరికట్టి, అవినీతి సిబ్బంది భరతం పడితేనే- క్షేత్రస్థాయిలో మార్పు మొదలవుతుంది. ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతపైకి పాలకులు దృష్టి మళ్ళించాలని విఖ్యాత సేద్య శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ గతంలోనే పిలుపిచ్చారు. రేపటి తరాలు ఎదుగుదల లోపాలతో గిడసబారిపోయే దురవస్థను నివారించే క్రమంలో ఆ హితబోధకు తలొగ్గడమే ప్రభుత్వాలు ఎక్కాల్సిన తొలిమెట్టు!

ఇదీ చూడండి:అంతర్జాతీయ సమస్యలపై మోదీ, జిన్​పింగ్​ చర్చ

New Delhi, Oct 12 (ANI): Union Home Minister Amit Shah said on Saturday that the RTI Act was a big milestone in country's journey of democracy and has helped bridge the gap between the people and administration. Addressing the 14th annual convention of the Central Information Commission (CIC) here, Shah said the Right to Information Act has also instilled confidence among people. "I feel that in our democratic journey, RTI is a big milestone. We can provide good administration on the basis of transparency and accountability. RTI has helped a lot in giving a boost to transparency and accountability," Shah said. He said the RTI Act has helped to bridge the gap between the people and the administration in the last 14 years. "It has also increased the confidence of people towards administration," he said. Shah said that RTI Act has achieved its goals and instilled the confidence among the citizens.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.