ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతులు ఇవ్వడంలో భాగస్వాములైన అధికారులు ఎవరూ తప్పు చేయలేదని, వారిని అరెస్టు చేయవద్దని దర్యాప్తు సంస్థలను కోరారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. అవినీతి కేసులో అరెస్టయి, ప్రస్తుతం దిల్లీ తిహార్ జైలులో ఉన్న ఆయన... తన సందేశాన్ని కుటుంబసభ్యుల ద్వారా ట్విట్టర్లో పోస్ట్ చేయించారు.
"నా తరఫున ఈ విషయాలు ట్వీట్ చేయమని నా కుటుంబ సభ్యులను కోరాను:-
'ఐఎన్ఎక్స్కు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి, మీ దగ్గరకు పంపిన అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదు? మిమ్మల్ని మాత్రమే ఎందుకు అరెస్టు చేశారు?' అని నన్ను అనేక మంది అడుగుతున్నారు.
ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
ఏ అధికారి కూడా తప్పు చేయలేదు. వారు అరెస్టు కావాలని నేను కోరుకోవడంలేదు."
-చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడ్డారన్నది చిదంబరంపై ప్రధాన ఆరోపణ. సీబీఐ ఆయన్ను ఇటీవలే అరెస్టు చేసింది.
ఇదీ చూడండి:శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు