కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. గాయపడిన జవాన్లను పరామర్శించడంలో మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ల మధ్య ఉన్న భేదాన్ని గమనించాలని పోలిక చూపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చిత్రాలు లక్షల పదాలకు సమానమని వ్యాఖ్యానించారు.
-
Pictures worth a million words. pic.twitter.com/ifC4La8Izj
— P. Chidambaram (@PChidambaram_IN) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pictures worth a million words. pic.twitter.com/ifC4La8Izj
— P. Chidambaram (@PChidambaram_IN) July 4, 2020Pictures worth a million words. pic.twitter.com/ifC4La8Izj
— P. Chidambaram (@PChidambaram_IN) July 4, 2020
గల్వాన్ లోయలో గాయపడిన జవాన్లకు లేహ్ ఆస్పత్రిలో అందిస్తున్న సదుపాయాలపై అంతకముందు విపక్షాలు విమర్శలు చేశాయి. దీనిపై భారత సైన్యం సమాధానమిచ్చింది. రక్షణ విభాగం తన ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలనే కల్పిస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఒకే ఊరిలో ఒకే పేరుతో.. వేలాదిమంది!