ETV Bharat / bharat

'మోదీజీ.. సరిహద్దు దాటకుంటే ఘర్షణ ఎందుకైంది?' - 'మోదీజీ.. సరిహద్దు దాటకుంటే ఘర్షణ ఎందుకు జరిగింది'

సరిహద్దు ఘర్షణపై అఖిలపక్ష సమావేశం సందర్భంగా మోదీ ఇచ్చిన వివరణ గందరగోళానికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. భారత సరిహద్దులోకి ఇతరులెవరూ ప్రవేశించకుంటే ఘర్షణ ఎలా జరిగిందని ప్రశ్నించారు.

chidambaram
సరిహద్దు దాటకుంటే ఘర్షణ ఎందుకు జరిగింది
author img

By

Published : Jun 20, 2020, 1:45 PM IST

తూర్పు లద్దాక్ గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన గందరగోళానికి, కలవరానికి గురిచేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. గల్వాన్ లోయ అంతా తమదేనన్న చైనా వ్యాఖ్యలపై కేంద్రం సమాధానమేమిటని ప్రశ్నించారు.

అఖిలపక్ష సమావేశం సందర్భంగా 'లద్దాక్​ వద్ద ఇతరులెవరూ భారత్​లోకి ప్రవేశించలేదు' అన్న మోదీ వ్యాఖ్యలు అంతకుముందు సైన్యాధిపతి, రక్షణ, విదేశాంగ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు చిదంబరం. ఒకవేళ ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశించకుంటే ఈ నెల 5,6 తేదిల్లో ఘర్షణ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు చిదంబరం.

ఇదీ చూడండి: భారత గగనతలంలోకి పాక్​ డ్రోన్​.. కూల్చిన భద్రతా దళాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.