ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించిన ట్రయిల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
73ఏళ్ల కాంగ్రెస్ నేతను ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని.. అందుకే కస్టడీకి అప్పగించినట్టు ట్రయిల్ కోర్టు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రిని అధికారులు తిహార్ జైలుకు తరలించారు.
యూపీఏ హయాంలో మంత్రిగా ఉండగా... విదేశీ నిధులు పొందేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్నది చిదంబరంపై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఇదీ చూడండి:- పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముతున్న నేత