ETV Bharat / bharat

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో కలవరం! - కరోనా తాజావార్తలు

తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 527 మందికి వైరస్​ సోకడం వైరస్​ తీవ్రతకు అద్దం పడుతోంది. చెన్నై అన్నానగర్​ డీసీపీ వైరస్​ బారినపడటం పోలీసుల్లో భయాందోళనలకు గురి చేస్తోంది.

Chennai city DCP has tested positive for COVID-19
డీసీపీకి కరోనా.. పోలీసుల్లో కలవరం..!
author img

By

Published : May 5, 2020, 9:16 AM IST

దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 527 మంది వైరస్​ బారినపడ్డారు. ఇందులో చెన్నై అన్నానగర్​ డీసీపీ కూడా ఉండటం స్థానిక పోలీసులను కలవరపెడుతోంది.

కరోనా లాక్​డౌన్​లో భాగంగా.. కోయంబేడు మార్కెట్​ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్​ స్థాయి అధికారికి సోమవారం కొవిడ్​ నిర్ధరణ అయింది. 2 రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న డీసీపీ.. ఆసుపత్రిలో చేరగా కొవిడ్​ పరీక్షల్లో వైరస్​ ఉన్నట్లు తేలింది. గత కొద్దిరోజులుగా ఇదే ప్రాంతంలో చాలా మంది వైరస్​ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన.. కిల్​పౌక్​ వైద్య ఆసుపత్రిలో(కేఎంసీ) చికిత్స తీసుకుంటున్నారు.

పోలీసుల్లో భయం భయం..

చెన్నై పారిశుద్ధ్య విభాగ సిబ్బంది.. డీసీపీ కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్​ చేశారు. ఆ డీసీపీ నేృతృత్వంలో విధులు నిర్వర్తించిన ఇతర పోలీసులు, సిబ్బందిని ఐసోలేట్​ చేశారు అధికారులు. పోలీస్​ అధికారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.