తప్పుడు ఫిర్యాదు చేసిన ఓ మహిళకు చెన్నై సివిల్ కోర్టు రూ.15 లక్షల జరిమానా విధించింది.
తమిళనాడు చెన్నైకి చెందిన సంతోష్.. పక్కింటి యువతితో ప్రేమలో పడ్డాడు. వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. అయితే, వీరి మధ్య ఓ భూవివాదం సమస్యకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సంతోష్ కుటుంబం వేరే చోటుకు మకాం మార్చారు.
ఆరేళ్లకు విడుదల..
తర్వాత.. యువతిపై సంతోష్ అత్యాచారం చేశాడని ఆమె తల్లి కేసు పెట్టింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 95 రోజుల తర్వాత అతనికి బెయిల్ లభించింది. ఈ మధ్యలో ఆ యువతి.. బిడ్డకు జన్మనిచ్చింది. డీఎన్ఏ పరీక్షల్లో సంతోష్ అత్యాచారం చేయలేదని తేలింది. ఫలితంగా 2016లో కోర్టు కేసు కొట్టివేసింది.
పరిహారానికి డిమాండ్..
తనపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు యువతి తల్లి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు సంతోష్. ఆరేళ్ల కాలంలో తన చదువుతో పాటు న్యాయపోరాటానికి రూ.2 లక్షలు ఖర్చు అయిందని పిటిషన్లో పేర్కొన్నాడు.
సంతోష్ వాదనలు విన్న సివిల్ కోర్టు.. యువతి తల్లిని రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: ఛాటింగ్ చేస్తోందని సోదరిని కాల్చేశాడు!