ETV Bharat / bharat

పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్ - కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ

పాక్..​ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. పండుగ వాతావరణం వేళ ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడాన్ని ఖండించింది. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్​ను పిలిపించి నిరసన తెలిపింది విదేశాంగ శాఖ.

Charged Affaires of the High Commission of Pakistan was summoned by the Indian Ministry of External Affairs
పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
author img

By

Published : Nov 14, 2020, 8:20 PM IST

సరిహద్దులో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్​​పై ఆగ్రహించింది భారత్​. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్​ను పిలిపించి నిరసన తెలిపింది.

భారత్‌లో పండుగ వాతావరణం ఉన్నసమయంలో ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. హింసను వ్యాప్తి చేసేలా పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న చర్యలను, సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఆ దేశం నుంచి అందుతున్న మద్దతును తప్పుబట్టింది.

జమ్ము కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందగా... మరో ఆరుగురు పౌరులు చనిపోయారు.

ఇదీ చదవండి: దీటుగా బదులిస్తాం.. పాక్‌, చైనాకు మోదీ హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.