బిహార్ ఛప్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సారన్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(ఈవీఎం)ను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అతణ్ని రంజిత్ పాసవాన్గా గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.
బిహార్‌లో మిగతా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.95 శాతం ఓటింగ్ నమోదైంది.