ETV Bharat / bharat

'ల్యాండర్​ పని 14 రోజులే.. ఆర్బిటర్​ది ఏడాది'

జాబిల్లిపై ల్యాండర్​ చేసే పనేంటి? 14 రోజులే ల్యాండర్​ పనిచేస్తుందా? తరువాత ఏం చేస్తుంది? ఆర్బిటర్​ ఏడాది కాలం పాటు ఏం పరిశోధనలు చేస్తుంది? వంటి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు ఇస్రో శాస్త్రవేత్త డా. ఎమ్​ అన్నాదురై.

'ల్యాండర్​ పని 14 రోజులే.. ఆర్బిటర్​ది ఏడాది పాటు'
author img

By

Published : Sep 5, 2019, 6:06 PM IST

Updated : Sep 29, 2019, 1:37 PM IST

జాబిల్లిపై దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు భారత్​ ప్రయోగించిన బాహుబలి ప్రాజెక్ట్​ చంద్రయాన్​-2. అసలు చంద్రయాన్​-1 తరహాలో చంద్రయాన్​-2ని జాబిల్లిపైకి క్రాష్​ ల్యాండ్​ ఎందుకు చేయడం లేదు? సాఫ్ట్​ ల్యాండింగ్​కే​ ఎందుకు మొగ్గు చూపారు? ఈ ప్రశ్నలకు ఈటీవీ ముఖాముఖిలో జవాబులు చెప్పారు ఇస్రో శాస్త్రవేత్త, మంగళ్​యాన్​, చంద్రయాన్​-1కు ప్రోగ్రామ్​ డైరక్టర్​గా ఉన్న డా. అన్నాదురై. చంద్రయాన్-2 గురించి ప్రపంచానికి తెలియని మరిన్ని విశేషాలను వెల్లడించారు.

ఇస్రో శాస్త్రవేత్తతో ముఖాముఖి

ప్ర. ఆర్బిటర్ సంవత్సరం పాటు కక్ష్యలో ఉంటుంది. సంవత్సరం కాలం పాటు ఆర్బిటర్ కక్ష్యలో ఏం చేస్తుంది?

జ. సైన్స్​ కోణంలో ల్యాండర్​ కంటే ఆర్బిటర్​ నుంచే ఎక్కువ ఆశిస్తున్నాము. సాంకేతికంగా ల్యాండర్ చంద్రునిపై దిగి ఒక్క ప్రాంతంలోనే పరిశోధిస్తుంది. పూర్తిగా చంద్రుడ్ని ల్యాండర్ పరిశీలించలేదు. ఆర్బిటర్ సంవత్సరం కంటే ఎక్కువ కాలం పని చేస్తుందని నేను ఆశిస్తున్నాను. చంద్రయాన్-1 తో పోలిస్తే చంద్రయాన్-2లో చాలా వరకు మెరుగైన పరికరాలు ఉన్నాయి. దాదాపు అదే రకమైన పరికరాలు ఉపయోగించినప్పటికీ వాటి సామర్థ్యం చాలా వరకు పెరిగింది.

ప్ర. మన దేశ శాస్త్ర సాంకేతిక రంగం చంద్రయాన్-2 ల్యాండింగ్ పట్ల ఏ రకంగా చూస్తోంది?

జ: ప్రత్యేకంగా యువ శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై భారత్ ఉనికిని చాటి చెప్పడానికి ఈ ప్రయోగం దోహదం చేస్తుంది. చంద్రునిపై అవుట్​ పోస్టులు ఏర్పాటు చేసుకోవడానికి, చంద్రమండల అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు, పర్యటక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం సహా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చంద్రయాన్-2 విజయంపై ఆధారపడి ఉన్నాయి.

New Delhi, Sep 05 (ANI): Senior Congress leader and former Maharashtra Chief Minister Ashok Chavan on Thursday said that Congress and Nationalist Congress Party (NCP) have agreed on 70 per cent seat sharing in upcoming Assembly Elections in Maharashtra with NCP. While speaking to ANI, he said, "We had good discussion with Nationalist Congress Party (NCP) regarding seat distribution for Assembly Elections in Maharashtra. We have agreed on 70 per cent of the seats, rest will also be taken care of."

Last Updated : Sep 29, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.