భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్-2. జాబిల్లిపై విశేషాలను వెలికితీసే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయోగం మరో కీలక దశ దాటనుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఛైర్మన్ శివన్ ప్రకటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ వందేళ్ల జయంతి కార్యక్రమం వేదికగా ఈ విషయం వెల్లడించారు.
"ఆగస్టు 14 తెల్లవారుజాము 3.30 నిమిషాలకు ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్‌గా పిలిచే కీలక దశ ముగియనుంది. ఈ దశలో చంద్రయాన్-2 భూకక్ష్యను విడిచి జాబిల్లి దిశగా కదలడం ప్రారంభిస్తుంది. ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడతాం. సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 చంద్రుడిపైకి చేరుకుంటుంది."
-శివన్, ఇస్రో ఛైర్మన్
3,850 కిలోల బరువున్న చంద్రయాన్-2లో ఆర్బిటర్, లాండర్, రోవర్ ఉన్నాయి.
ఇదీ చూడండి: రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే