ETV Bharat / bharat

చంద్రయాన్​-2 ప్రయోగ సమాచారం విడుదల - అంతర్జాతీయ కీర్తి చంద్రయాన్​-2

చంద్రయాన్​-2కు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది ఇస్రో. త్వరలో చంద్రయాన్​-3 చేపట్టనున్నట్టు తెలిపింది.

Chandrayaan-2 mission's initial data released: ISRO
చంద్రయాన్​-2 ప్రయోగ విశేషాలు విడుదల చేసిన ఇస్రో
author img

By

Published : Dec 25, 2020, 11:37 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2 ప్రయోగ విశేషాలను విడుదల చేసింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే ఇలా చేసినట్టు ప్రకటించింది. చంద్రుడిపై ఎనిమిది పరిశోధనలు చేపట్టగా.. ఎన్నో ఖగోళశాస్త్ర ప్రశ్నలకు సమాధానం లభించిందని ఇస్రో పేర్కొంది.

2019 జులై 22-న ఆంధ్రప్రదేశ్​లోని సతీశ్​ ధావన్​ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్​-2ను ప్రయోగించింది ఇస్రో.

త్వరలో చంద్రయాన్​-3..

చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలను కనుగొడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయోగ చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్​ గట్టిగా ఢీకొనగా సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ ఆర్బిటార్ సమాచారాన్ని పంపుతోంది.

మరోసారి విజయవంతంగా రోవర్​, ల్యాండర్​ను చంద్రుడిపైకి పంపే చంద్రయాన్​-3 మిషన్​ను త్వరలోనే చేపట్టనున్నట్టు ఇస్రో ఛైర్మన్​ కె.శివన్​ ప్రకటించారు.

ఇదీ చదవండి: గగన్​యాన్​పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.