భారత్‌లో శాంతియుత పరిస్థితులు ఉండకూడదనే అక్కసుతో కొన్ని శక్తులు నేపాల్, భూటాన్ సరిహద్దుల ద్వారా చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నేపాల్, భూటాన్ సరిహద్దులను పరిరక్షించే 'సశస్త్ర సీమా బల్' వ్యవస్ధాపక దినోత్సవంలో పాల్గొన్నారు షా. ఈ దేశాలతో భారత్‌కు చక్కని సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలను ఉపయోగించుకుని కొందరు మాదక ద్రవ్యాల సరఫరాను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు అమిత్ షా.
మీ భద్రతే భరోసా..
సరిహద్దులో జవాన్లు ఉన్నరనే నమ్మకంతోనే 130 కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా నిద్రిస్తున్నారని కొనియాడారు షా. మైనస్ 37 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌లోనూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. సరిహద్దు భద్రతా జవాన్లు తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కనీసం ఏడాదిలో 100 రోజులు గడిపేలా మోదీ ప్రభుత్వం ఏడాదిన్నర లోగా నిర్ణయం తీసుకుంటుందని షా హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'పౌర' ఆందోళనలు ఉద్ధృతం... పలు చోట్ల కర్ఫ్యూ