ETV Bharat / bharat

కశ్మీర్​ నుంచి మహారాష్ట్రకు సీఏపీఎఫ్ బృందాలు - 10 సీఏపీఎఫ్ జమ్ము కశ్మీర్

జమ్ము కశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తున్న 10 సీఏపీఎఫ్ బృందాలను అక్కడి నుంచి ఉపసంహరించింది హోంశాఖ. ఇందులో 9 బృందాలను మహారాష్ట్రకు కేటాయించింది. అదనపు బలగాలు అవసరమని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకే ఈ దళాలు పంపినట్లు తెలుస్తోంది.

CAPF
సీఏపీఎఫ్
author img

By

Published : May 16, 2020, 7:40 PM IST

జమ్ము కశ్మీర్​లో ఉన్న 10 కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎఫ్) బృందాలను అక్కడి నుంచి ఉపసంహరించేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం వెయ్యి మంది ఉండే ఈ దళాలను జమ్ము ప్రాంతం నుంచి తొలగించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.

జమ్ములో ఉపసంహరించిన సీఏపీఎఫ్ బృందాల్లో 9 విభాగాలను మహారాష్ట్రకు హోంశాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. నాలుగు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రెండు సీఆర్​పీఎఫ్, మూడు సీఐఎస్​ఎఫ్ దళాలను ఆ రాష్ట్రానికి బదిలీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

వారి కోరిక మేరకే..

లాక్​డౌన్ కారణంగా అధిక పని ఒత్తిడి ఏర్పడిన పోలీసు సిబ్బందికి ఉపశమనం కలిగించేలా.. 20 సీఏపీఎఫ్ బృందాలను పంపాలని మహారాష్ట్ర ఇదివరకే కేంద్రాన్ని కోరింది. రంజాన్ పర్వదినం సైతం దగ్గర పడుతుంటంతో అదనపు బలగాలు అవసరమని విజ్ఞప్తి చేసింది. ఆ రాష్ట్ర అభ్యర్థన మేరకే ఈ దళాలను పంపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 32 సీఆర్​పీఎఫ్ బృందాలు మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.