జమ్ముకశ్మీర్ నుంచి 10 వేల మంది పారామిలిటరీ బలగాల తక్షణ ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును కేంద్ర హోంశాఖ సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
గతేడాది ఆర్టికల్ 370రద్దు అనంతరం వీరిని జమ్ముకశ్మీర్‌కు తరలించింది కేంద్రం. తాజాగా.. బలగాలు దేశవ్యాప్తంగా ఉన్న తమ శిబిరాలకు తక్షణమే చేరుకోవాలని ఆదేశించింది.
దీని ప్రకారం.. సీఆర్పీఎఫ్లోని 40 కంపెనీలు, సీఐఎస్ఎఫ్లోని 20 కంపెనీలతో పాటు బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ బలగాలు.. ఈ వారం చివరిలోగా జమ్మకశ్మీర్ను వీడుతారు.
తాజా ఉపసంహరణతో.. కశ్మీర్ లోయలో 60 బెటాలియన్ల(ప్రతి దాంట్లో 1,000 మంది) సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరికి తొడు కొద్దిమంది సీఏపీఎఫ్ సిబ్బంది ఉండనున్నారు.
ఇదీ చూడండి:- కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం