బంగాల్ ప్రభుత్వంపై కేంద్రం తీవ్రస్థాయిలో మండిపడింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా అవసరమైన వస్తువుల రవాణాను అనుమతించనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలతో అంతర్జాతీయ చిక్కులు వస్తాయని హెచ్చరించింది కేంద్రం.
కార్గో స్వేచ్ఛా రవాణాపై పదే పదే ఆదేశాలు ఇవ్వలేమని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. ఇటువంటి చర్యలు విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని తెలిపింది. ఈ మేరకు బంగాల్ సీఎస్‌కు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.
బంగ్లాదేశ్‌కు వెళ్లి తిరిగి వస్తోన్న వాహన చోదకులను రానివ్వటం లేదని కేంద్రం ఆరోపించింది. ఫలితంగా వాళ్లంతా ఆ దేశంలో చిక్కుకుపోయారని తెలిపింది. ఈ విపత్కర సమయంలో సరిహద్దు రవాణా అనుమతించాలని బంగాల్ ప్రభుత్వానికి భల్లా సూచించారు.
ఇదీ చూడండి: అక్కడి భారతీయుల కోసం ఈ వారంలో ప్రత్యేక విమానాలు