ETV Bharat / bharat

వలస కూలీలను రాష్ట్రాలు బహిష్కరించవద్దు: కేంద్రం - వలస కార్మికులను ఆదుకోండి

దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటానికి లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చేపడుతున్న చర్యలపై ఆయా రాష్ట్రాలకు సంబంధించి రోజువారీగా నివేదిక తయారు చేయాలని కేంద్రమంత్రులను కోరింది. దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొంది. వలస కార్మికులను రాష్ట్రాలు బహిష్కరిచవద్దని సూచించింది. మరోవైపు రేడియో జాకీలతో సమావేశమైన ప్రధాని మోదీ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి చేరవేయాలని కోరారు.

north block
నార్త్ బ్లాక్
author img

By

Published : Mar 28, 2020, 7:25 AM IST

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చేపడుతున్న చర్యలను రోజువారీగా నివేదిక రూపొందించాలని కేంద్ర మంత్రులకు సూచించింది ప్రధానమంత్రి కార్యాలయం. క్వారంటైన్​, వైద్య సదుపాయాలు సహా లాక్​డౌన్​ ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రాల వారీగా నివేదిక తయారు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోవాలని కేంద్ర మంత్రులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రాష్ట్రాలకు మంత్రులను ఇంఛార్జీలుగా నియమించినట్లు తెలుస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్​లు, ఎస్పీల నుంచి సమాచారం సేకరించి.. ప్రధాని కార్యాలయానికి ఫీడ్​బ్యాక్ అందజేయానున్నారు కేంద్ర మంత్రులు . వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు... లాక్​డౌన్ ప్రభావంపై నివేదిక సమర్పించనున్నారు. దీంతో పాటు కేంద్రం మార్గదర్శకాలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నాయో లేదో అన్న విషయాన్ని వీరు పరిశీలించనున్నారు.

వలస కార్మికులను ఆదుకోండి

లాక్​డౌన్ సమయంలో వలస కార్మికులను రాష్ట్రాలు బహిష్కరించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయం, పారిశ్రామిక సహా అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లకుండా చూడాలని హోంశాఖ కోరింది. హోటళ్లు, మహిళల హాస్టళ్లకు నిత్యవసర వస్తువుల సరఫరా నిలిచిపోకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నిత్యవసరాలు సహా ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్న విషయం తెలియజేయాలని పేర్కొంది.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన కార్మికులు తమ స్వస్థలాలకు చేరేందుకు దిల్లీలోని ఘజిపుర్​ సరిహద్దు వద్ద భారీగా చేరుకున్నారు. వారందరినీ పోలీసులు విడతల వారీగా ఉత్తర్​ప్రదేశ్​లోకి అనుమతించడం వల్ల కాలినడకనే వారు స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సదా మీ సేవలో!

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహార్​కు చెందిన వలస కూలీలను తమ స్వస్థలానికి చేర్చేందుకు స్పైస్​జెట్ ముందుకొచ్చింది. ఈ మేరకు దిల్లీ, ముంబయి నుంచి పట్నాకు విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 21 రోజుల లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం చేపట్టే మానవతా దృక్పథ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండిగో, గోఎయిర్​ సంస్థలు సైతం ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

దివ్యాంగులపై శ్రద్ధ

లాక్​డౌన్ సమయంలో దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వ్యక్తిగత సహాయం, సమాచార సదుపాయం కల్పించాలని సూచించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. శారీరక వైకల్యం, ఇంద్రియ పరిమితుల కారణంగా దివ్యాంగులు కొవిడ్-19 బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సహాయకులను లాక్​డౌన్ ఆంక్షల నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది. సహాయకులకు అవసరమైన రక్షణ పరికరాలను అందించాలని తెలిపింది. కంటిచూపు సరిగా లేని వ్యక్తులు సహా తీవ్రమైన వైకల్యం ఉన్న వారిని విధుల నుంచి మినహాయించాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక హెల్ప్​లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

రేడియో జాకీలతో మోదీ

కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కథనాలను అందించాలని రేడియో జాకీలను ప్రధాని మోదీ కోరారు. తద్వారా బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రేడియో జాకీలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా నిపుణుల సలహాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు మోదీ. వైద్యులు, పోలీసులు, ఎయిర్​లైన్స్ సిబ్బంది నిబద్ధతను ప్రజలకు చాటి చెప్పాలని కోరారు. వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఆల్​ ఇండియా రేడియో ముఖ్య భూమిక పోషించాలన్నారు.

మీరూ ఓ ఆర్​జే

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ఓ ఆర్​జే అని రేడియో జాకీలు అభివర్ణించారు. 2014 నుంచి రేడియోలో మన్​కీ బాత్​ కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. కరోనాపై పోరాటంలో భాగంగా దేశ గళాన్ని వినిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని మోదీకి వాగ్దానం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.