ETV Bharat / bharat

పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం వద్దు: కేంద్రం - states ban poultry supply news

పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం విధించొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీని వల్ల పౌల్ట్రీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. ఆరోగ్యం, అటవీ శాఖలకు పరిస్థితిని వివరించి వారిని అప్రమత్తం చేయాలని సూచించింది. పౌల్ట్రీ రైతుల సంక్షేమం కోసం బర్డ్‌ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది.

Centre asks states not to ban supply of poultry from other states
పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం వద్దు: కేంద్రం
author img

By

Published : Jan 14, 2021, 5:20 AM IST

దేశంలో బర్డ్‌ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం విధించరాదని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. సరఫరాపై నిషేధం విధించడం పౌల్ట్రీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధంగా సరఫరాపై నిషేధం విధించాయని, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది.

ఆరోగ్యం, అటవీ శాఖలకు పరిస్థితిని వివరించి వారిని అప్రమత్తం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తగినంతగా సరఫరా ఉండేలా చూడడం సహ కోళ్లఫారాలలో బయోసెక్యూరిటీ చర్యలు చేపట్టాలని తెలిపింది. పౌల్ట్రీ రైతుల సంక్షేమం కోసం బర్డ్‌ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది.

మరోవైపు జార్ఖండ్‌, జమ్ముకశ్మీర్‌ల్లో పక్షుల అసహజ మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

ఇదీ చూడండి: తొలిదశలో 1.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.