ETV Bharat / bharat

విపత్తు సాయం కింద 6 రాష్ట్రాలకు రూ.4,382 కోట్లు!

ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన ఆరు రాష్ట్రాలకు సాయం కింద త్వరలోనే రూ.4,382 కోట్లు విడుదల చేయనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో బంగాల్​, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి.

calamity assistance
ఆరు రాష్ట్రాలకు విపత్తు సాయం
author img

By

Published : Nov 13, 2020, 4:02 PM IST

ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర సాయం అందించనుంది. ఇందుకు గానూ రూ.4,382 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది తుపానులు, వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన.. బంగాల్​, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, సిక్కింకు త్వరలోనే ఈ నిదులు విడుదల కానున్నాయి.

"జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్​డీఆర్​ఎఫ్​) నుంచి ఆరు రాష్ట్రాలకు కేంద్ర సాయం కింద రూ. 4,381.88 కోట్లు విడుదలకు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపింది."

- కేంద్ర హోంశాఖ

  • తుపాను అంఫాన్​తో ప్రభావితమైన బంగాల్​కు రూ.2,707.77 కోట్లు, ఒడిశాకు రూ.128. 23 కోట్లు
  • నిసర్గ తుపాను ప్రభావిత మహారాష్ట్రకు రూ.268.59 కోట్లు
  • నైరుతి రుతుపవనాల సమయంలో వరదలు, కొండచరియలు విరిగిపడి నష్టపోయిన కర్ణాటకు రూ.577.84 కోట్లు, మధ్యప్రదేశ్​కు రూ.611.61 కోట్లు. సిక్కింకు రూ.87.84 కోట్లు.

ఈ ఏడాది మే నెలలో అంపాన్​ తుపాను బంగాల్​, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. మే 22న ఆయా రాష్ట్రాలను సందర్శించారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తక్షణ సాయం కింద బంగాల్​కు రూ.వెయ్యి కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు ప్రకటించారు. మే 23నే ఈ నిధులను విడుదల చేశారు. దానికి అదనంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. అలాగే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాలకు ఎస్​డీఆర్​ఎఫ్​ నిధుల నుంచి రూ.15,524.43 కోట్లు విడుదల చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: వాతావరణ మార్పులతో కొండంత విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.