ETV Bharat / bharat

చక్రాల్లోకి చున్నీ వెళ్లకుండా మార్చేస్తారట! - new traffic rules

ఇకపై చున్నీలు, చీర కొంగులు బైకు చక్రాల్లో ఇరుక్కుని జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టనుంది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ. ద్విచక్రవాహనాల చక్రాలకు ఇరువైపులా ఓ కవచాన్ని ఏర్పాటు చేయాలని వాహన తయారీదారులను ఆదేశించింది. ఇది ఈ ఏడాది అక్టోబర్​ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాలని సూచించింది.

central road transport ministry new rules to reduce bike accidents due to duppatta or saree or chunnies of women
చక్రాల్లోకి చున్నీ వెళ్లకుండా మార్చేస్తారట!
author img

By

Published : Feb 17, 2020, 8:37 AM IST

Updated : Mar 1, 2020, 2:20 PM IST

ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. బైక్‌పై వెనకవైపు కూర్చున్న మహిళల చీర, చున్నీ వంటివి చక్రాల్లోకి వెళ్లిపోయి ప్రమాదాలకు కారణమవుతున్న దృష్ట్యా కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.

వెనక చక్రంలో కనీసం సగ భాగాన్ని కప్పి ఉంచేలా వాహన తయారీదారులు ఏర్పాట్లు చేయాలని, ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ లోగా ఇది అమలు జరగాలని ఆదేశించింది. వెనక వైపు కూర్చున్నవారు పట్టుకునేందుకు వీలుగా వాహనానికి పక్కన గానీ, డ్రైవరు సీటుకు వెనక గానీ ఒక హ్యాండిల్‌ తప్పనిసరిగా బిగించాలని, పాదాన్ని ఆన్చడానికి తగిన ఏర్పాట్లూ చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది.

ఇకపై ఇవి ఉండవు...

* ఆన్‌లైన్‌ ఆర్డర్లపై హోటళ్ల నుంచి ఆహార పొట్లాలు తెచ్చేవారు తమకు నచ్చిన రీతిలో ద్విచక్ర వాహనాల వెనకవైపు పెట్టెల్ని బిగించుకుంటున్నారు. ఇకపై దీనికీ కళ్లెం పడనుంది. వీటి ఎత్తు 50 సెం.మీ, వెడల్పు 51 సెం.మీ, పొడవు 55 సెం.మీ. లోపు ఉండాలి. పెట్టె, దానిలో ఉండే పార్శిళ్ల బరువు కలిపి 30 కిలోలు మించకూడదు.

* వ్యవసాయ ట్రాక్టర్లు, నిర్మాణ సామగ్రి సంబంధిత వాహనాల్లో డ్రైవర్లకు క్యాబిన్‌, దానికి ఒక కిటికీ ఉండాలి. ఇవన్నీ అక్టోబరు నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇదీ చదవండి:విద్యాలయాల్లో లైంగిక వేధింపుల విష సంస్కృతి

Last Updated : Mar 1, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.