ETV Bharat / bharat

రుణగ్రస్త రాష్ట్రాలతో లక్ష్యం నెరవేరేనా? - economically support

భారత ఆర్థిక వ్యవస్థను 5లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మొదటి బడ్జెట్​ సమావేశంలో అన్నారు. అయితే ఈ స్పప్నం నెరవేరాలంటే రాష్ట్రాలే కీలకమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సమన్వయంతో కృషి చేస్తేనే 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

రుణగ్రస్త రాష్ట్రాలతో లక్ష్యం నెరవేరేనా?
author img

By

Published : Aug 30, 2019, 6:26 PM IST

Updated : Sep 28, 2019, 9:23 PM IST

అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం

రాబోయే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న నరేంద్ర మోదీ సర్కారు సంకల్పం సర్వత్రా ఆసక్తిని, ఆశాభావాన్ని రేపుతోంది. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడి ప్రకారం ఏదీ అసాధ్యం కాదు. అయితే, ఆర్థిక ఫలాలు ప్రజలందరికీ అందకపోతే లాటిన్‌ అమెరికా దేశాల్లో మాదిరిగా తీవ్ర ఆదాయ వ్యత్యాసాలు, సామాజిక అశాంతి ప్రబలి మొదటికే మోసం వస్తుంది. అలాంటిది జరగకుండా జాగ్రత్త పడుతూనే, అయిదు లక్షల కోట్ల డాలర్ల స్వప్నం నెరవేరడానికి రాష్ట్రాలే కీలకమని గుర్తించాలి. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడనిదే ఈ స్వప్నం నెరవేరదు. అభివృద్ధి, సంక్షేమాలకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే నిధులకన్నా రాష్ట్రాలు వ్యయం చేసే నిధులే అధిక ప్రయోజనాలను అందిస్తాయి. పైగా ఆ ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు సమన్వయంతో కృషి చేస్తేనే అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సుసాధ్యమవుతుంది. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు తాము అనుసరిస్తున్న ఆర్థిక నమూనాలను పునఃసమీక్షించుకోవాలి. తమ పంథా మార్చుకోవడానికి కఠిన నిర్ణయాలకు వెనకాడకూడదు. ఆ చొరవ చూపడంలో రాష్ట్రాలు ఎంత ఆలస్యం చేస్తే అంతగా వాటి ఆర్థిక స్వస్థత దిగజారిపోతుంది.

ఏ ఆర్థిక వ్యవస్థ అయినా రెట్టింపు పెరగాలంటే వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, సేవా రంగం, ఎగుమతులు అన్నీ జోరందుకోవాలి. ఇంతవరకు భారత్‌ సాధించిన అభివృద్ధి అంతా సేవారంగంలో దిగువ శ్రేణి మీద, ప్రభుత్వంలో అన్ని స్థాయులు ఎడాపెడా చేసిన అప్పుల మీద ఆధారపడింది. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు చేసిన అప్పుల వల్ల వ్యవసాయం, పరిశ్రమల్లో ఉద్యోగాలు పెరిగిందీ లేదు, మౌలిక వసతులు విస్తరించిందీ లేదు. ప్రభుత్వం అదనంగా విలువ జోడింపూ సాధించలేకపోయింది. ఏదో ఒక విధంగా అధిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును సాధిస్తే చాలనుకొంది. ఇంతవరకు అన్ని ప్రభుత్వాల ఇదే వరస. సాంకేతికత విజృంభిస్తున్న ఈ రోజుల్లో అదనపు విలువ జోడింపు చాలా చాలా ముఖ్యం. అందుకు ఉత్పాదకత పెంచాలి. భారత సర్కారు ఆ దిశగా కృషి చేయకుండా అప్పులమీద వస్తుసేవల వినియోగం పెంచి, తద్వారా జీడీపీ వృద్ధిని చూపుతూ వస్తోంది. అంతేతప్ప గత పదేళ్లలో నికర విలువ జోడింపు కనీసం రెట్టింపైనా పెరగలేదు.

అప్పుల కొండ

రాష్ట్రాల్లో 2014-17 మధ్యకాలంలో కర్మాగారాల సంఖ్య చాలా స్వల్పంగానే పెరిగింది. అదే 2010-14 మధ్య కర్మాగారాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఆ తరవాత వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దెబ్బకు ఉన్న కర్మాగారాలు మూతపడి వాటి స్థానాన్ని భర్తీ చేసే స్థాయిలో కొత్త కర్మాగారాలు ఏర్పడలేదు. ఇంకా విచారకరమేమంటే 2012-13 నుంచి 2016-17 వరకు అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి సంచయం క్షీణించడం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వచ్చిపడే వరకు రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి పథంలోనే ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు సైతం సూచించాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం, పాత రుణాలపై వడ్డీ చెల్లింపులు పెరిగిపోతుంటే రెండోవైపు జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అనే జంట తంటాలతో ఆదాయం అదే స్థాయిలో పెరగక ఖజానాకు పెద్ద బొర్రె పడుతోంది. అయినా కూడా రాష్ట్రాలు వార్షిక బడ్జెట్లలో ఆదాయాన్ని అసలుకన్నా ఎక్కువగా అంచనా వేసి, తాహతు మించి ఖర్చు చేస్తూ, చివరకు తీవ్రలోటులోకి జారిపోతున్నాయి. రాష్ట్రాలు తాము తీసుకున్న రుణాలను మరింత సమర్థంగా, బాధ్యతగా ఖర్చుచేయాలి.

పొదుపునకు ప్రాధాన్యమివ్వాలి. 2008 తరవాత మళ్ళీ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని గ్రహించి ఆచితూచి ఖర్చుచేయాలి. 1991 నుంచి రాష్ట్రాల రుణ భారం పెరగడమే తప్ప తరిగింది లేదని ఇటీవల రిజర్వు బ్యాంకు గణాంకాలు రూఢిచేశాయి. 1991లో అన్ని రాష్ట్రాల రుణ భారం రూ.1.28 లక్షల కోట్లు. 2019 మార్చినాటికి అవి 45 లక్షల కోట్ల రూపాయలను మించాయి. 1990లో రూ.8,660 కోట్లుగా ఉన్న వడ్డీ చెల్లింపులు 2019కల్లా మూడు లక్షల కోట్ల రూపాయలను మించిపోయాయి. జీతభత్యాలు, పింఛన్లు, బాధ్యతారహితమైన పథకాలు, రుణ కిస్తీల చెల్లింపులకే రాష్ట్రాల ఆదాయం హరించుకుపోతోంది. ఉదాహరణకు 1990-91లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ పింఛన్లకు రూ.330 కోట్లు ఖర్చుచేయగా, రాష్ట్ర విభజన అనంతరం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే 2018-19లో ఈ పద్దుకు రూ.15,200 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. తెలంగాణ పింఛన్ల ఖర్చు రూ.11,700 కోట్లకు చేరింది. ఆర్థిక మాంద్యంలో ఇంత ఖర్చును రెండు తెలుగు రాష్ట్రాలు తట్టుకోగలుగుతాయా? ఆదాయ వనరులు లేకపోయినా కేవలం ఓట్లు దండుకొని ఎన్నికల్లో గెలవడం కోసమని రాజకీయ పార్టీలు పేదలకు సబ్సిడీలు, ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల పెంపుదలను పాచికలుగా వాడుతున్నాయి. ఆ ఖర్చులు భరించలేక పదేపదే రిజర్వు బ్యాంకు వద్దకు ఓవర్‌ డ్రాఫ్టుల కోసం పరుగెడుతున్నాయి. అత్యవసరమైనప్పుడు తీసుకోవలసిన ఓవర్‌ డ్రాఫ్ట్‌ రాష్ట్రాలకు నిత్యావసరమైపోవడం విచారకరం.

రాష్ట్రాలు తమ సామాజిక సంక్షేమ వ్యయాన్ని పునఃసమీక్షించుకోవలసిన సమయం వచ్చేసింది. సంక్షేమ పథకాలు, సబ్సిడీలను నిజంగా అర్హులకే పరిమితం చేయాల్సింది పోయి ఓట్ల కోసం అసంఖ్యాక జనానికి పందేరం చేస్తున్నాయి. ఈ క్రమంలో అనర్హులూ వచ్చిచేరుతున్నారు. 1990-91లో రూ.35,130 కోట్లుగా ఉన్న రాష్ట్రాల సామాజిక వ్యయం, 2018-19 వచ్చేసరికి రూ.14.90 లక్షల కోట్లకు చేరుకుంది. ఇన్ని లక్షల కోట్లు వెచ్చిస్తున్నా పేదరికం మాత్రం అలానే ఉంది. దీనికి కారణమేమిటో రాష్ట్రాలు ఆలోచించుకోవాలి. సామాజిక వ్యయం వల్ల ప్రజల అవసరాలు తీరడమే కాదు, వారితోపాటు యావత్‌ దేశమూ ఆర్థికంగా అభివృద్ధి చెందే వాతావరణం ఏర్పడాలి. అందుకు దిట్టమైన పునాదులు పడాలి. ప్రజలకు సామాజిక భద్రత ఉండటం అవసరమే. వృద్ధులు, బాలలు, దివ్యాంగులు, నిస్సహాయులను ఆదుకోవడానికి సామాజిక సబ్సిడీలు తప్పక ఇవ్వాలి. కానీ, పని చేయడానికి తగిన వయసు, శారీరక, మానసిక శక్తి ఉన్నవారికీ సబ్సిడీలు, పింఛన్లు ఇవ్వడం ఏమాత్రం సబబు కాదు. పైగా రాష్ట్రాలు అప్పుచేసి మరీ సబ్సిడీలు ఇవ్వడం భవిష్యత్తుకు, ఆర్థిక భద్రతకు ఏమాత్రం క్షేమకరం కాదు. పేదలకు సబ్సిడీలు ఇవ్వొద్దని ఎవరూ అనడం లేదు, రాష్ట్రాలు అప్పుచేసి పప్పుకూడు తినడం మంచిది కాదని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఉన్న డబ్బంతా సామాజిక సంక్షేమ పథకాలకే ఖర్చయిపోతే, పరిశ్రమలు, మౌలిక వసతుల స్థాపనకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి లేకుండా ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన సాధ్యం కాదు. ఉద్యోగాలు, వ్యాపారాలు పెరిగితేనే కదా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరేది! ఆదాయం పెరిగినప్పుడు సంక్షేమానికి నిధులు లభిస్తాయి. ఆ పని చేయకుండా అప్పుల మీద బండి నడిపించలేమని ప్రభుత్వాలు గుర్తించాలి.

ఆర్థిక క్రమశిక్షణ తక్షణావసరం

రాష్ట్రాలకు నిధుల కటకట ఏర్పడినప్పుడల్లా బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల వద్దకు పరుగెడుతుంటాయి. ఈ సంస్థలపై వచ్చే మెత్తని ఒత్తిళ్ల వల్ల అవి రాష్ట్రాలకు రుణాలివ్వక తప్పడం లేదు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాలకు సైతం కొత్త అప్పులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ కొత్త రుణాలను పాత రుణ కిస్తీలు, వడ్డీ చెల్లించడానికో వెచ్చిస్తారని తెలిసి కూడా అప్పులివ్వక తప్పడం లేదు. ఇది చివరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సుస్థిరతకు చేటుతెస్తోంది. దీన్ని నివారించడానికి రాష్ట్రాలు నిధుల కోసం బ్యాంకుల మీద కాకుండా బాండ్‌ మార్కెట్ల మీద ఆధారపడటం మంచిది. అందుకే కేంద్రం ఈ దిశగా రాష్ట్రాలను మార్కెట్‌ రుణాలు తీసుకోవాలని సూచిస్తోంది. బాండ్ల ద్వారా నిధులు సేకరించదలచిన రాష్ట్రాలు మొదట తమ ఇల్లు చక్కదిద్దుకోవలసి ఉంటుంది. ఆర్థికంగా గట్టి పునాదులు ఉన్న రాష్ట్రాలు విడుదల చేసే బాండ్లకు మాత్రమే విలువ ఉంటుంది. వాటిని కొనడానికి వ్యక్తులు, సంస్థలు ముందుకొస్తాయి. బాండ్ల విపణి విస్తరిస్తున్న కొద్దీ ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యత ఉన్న రాష్ట్రాల బాండ్లకు గిరాకీ హెచ్చుతుంది. అప్పులు తగ్గించుకుని ఆదాయం పెంచుకున్న రాష్ట్రాలది పైచేయి అవుతుంది.

కేంద్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు, రాజకీయ అగత్యాలకు అతీతంగా ఆలోచించాలి, జనాకర్షక పథకాల కోసం ఎడాపెడా అప్పులు చేసేసి సమస్యల్లో పడవద్దని రాష్ట్రాలకు జాగ్రత్త చెప్పాలి. చేతులు కాలకముందే కేంద్రం ఈ పని చేయాలి. ఖర్చులు, బడ్జెట్‌ లోట్లను తగ్గించుకొంటే దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి సుసాధ్యమవుతుందని హితవు చెప్పాలి. రేపటి ఆర్థిక స్వస్థత కోసం రాష్ట్రాలు ఇవాళ చేదు గుళిక మింగడానికి సిద్ధపడాలి. స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఖజానాను దివాలా తీయించే పెడధోరణులతో దారి తప్పిన రాష్ట్రాలపై 360వ అధికరణాన్ని కొరడాలా ఝళిపించే అధికారాన్ని రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని మరవకూడదు. భారతదేశం లేదా అందులో కొన్ని ప్రాంతాల ఆర్థిక సుస్థిరత కానీ, పరపతి కానీ దెబ్బతింటాయనుకొంటే రాష్ట్రపతి 360వ అధికరణ కింద ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించవచ్చు. అదే జరిగితే జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చే స్తోమత... ఇలా అన్నింటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అది ప్రస్తుత మాంద్య ప్రమాదంకన్నా ఎన్నోరెట్లు తీవ్రమైనది అవుతుంది!

-డాక్టర్​ ఎస్​.అనంత్,​ (ఆర్థిక సామాజిక రంగ నిపుణులు).

Intro:Body:

gsgs

Conclusion:
Last Updated : Sep 28, 2019, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.