బర్డ్ ఫ్లూ వైరస్ విషయంలో కేంద్రం అప్రమత్తమైంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కేసులు బయటపడిన నేపథ్యంలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పాడి, పశు సంవర్థక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది. వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్దేశించింది.
ఇదీ చదవండి: చలికి తోడైన వాన- మూడు రోజులుగా వణుకుతున్న దిల్లీ