ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇక 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' - undefined

employee
కేంద్రప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇక 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​'
author img

By

Published : Mar 19, 2020, 2:57 PM IST

Updated : Mar 19, 2020, 5:10 PM IST

17:10 March 19

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా(వర్క్ ఫ్రం హోం) వీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రూప్​ బీ, సీకి చెందిన 50శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని, మిగిలిన వారు కార్యాలయాలకు రావాలని సూచించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

"గ్రూప్-బీ, సీ సిబ్బంది ప్రత్యామ్నాయ పద్ధతిలో కార్యాలయాలకు వచ్చేలా రోస్టర్ విధానాన్ని రూపొందించాలని అన్ని శాఖల అధిపతులకు సూచిస్తున్నాం. ఇంటి నుంచి పనిచేసే అధికారులు ఫోన్​లలో తప్పకుండా అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయంలో వారు కూడా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది."

-సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు

ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగుల సమయంలోనూ మార్పులు చేసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5:30, ఉదయం 9:30 నుంచి 6గంటలు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు పనిచేసేలా నూతన సమయపాలన పట్టిక రూపొందించింది. ఉద్యోగులను మూడు గ్రూపులుగా విభజించి ఆ సమయాల్లోనే హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

అయితే కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి అత్యవసర సేవలు అందించే శాఖలకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది. కొవిడ్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్ని శాఖలకు ఇదివరకే సూచించింది సిబ్బంది శాఖ. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది కోసం ఆయా శాఖలు ఇదే తరహా విధివిధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

14:54 March 19

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇక 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​'

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందితో ఇంటి నుంచే విధులు(వర్క్​ ఫ్రమ్​ హోమ్​) నిర్వర్తింపచేయాలని నిర్ణయించింది. మిగిలిన వారు కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశించింది. 

Last Updated : Mar 19, 2020, 5:10 PM IST

For All Latest Updates

TAGGED:

corona
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.