ETV Bharat / bharat

'ముందుగా చిక్కుకుపోయిన వలస కార్మికులకే అనుమతి'

వలస జీవులకు మరో కష్టం వచ్చి పడింది. సొంతూళ్లకు వెళ్లడానికి జారీ చేసిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది కేంద్రం. మహా నగరాలన్నీ ఖాళీ అయి కార్మికులు దొరకని పరిస్థితి నెలకొనడం వల్ల లాక్​డౌన్​ ముందు అనుకోకుండా బయటకొచ్చి చిక్కుకుపోయిన వారినే తరలించాలని పేర్కొంది.

CENTER ISSUES FRESH GUIDELINES FOR MIGRANT WORKERS TRANSPORT
'ముందుగా ఇరుక్కుపోయిన వలస కార్మికులకే అనుమతి'
author img

By

Published : May 4, 2020, 7:39 AM IST

Updated : May 4, 2020, 9:16 AM IST

వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడానికి జారీచేసిన మార్గదర్శకాల వల్ల మహా నగరాలన్నీ ఖాళీ అయి కార్మికులు దొరకని పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం అందులో సవరణలు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు అనుకోకుండా సొంతూళ్లు/ పనిచేస్తున్న ప్రాంతాల నుంచి బయటికొచ్చి ఇరుక్కుపోయిన వారికే ఆ వెసులుబాటు వర్తిస్తుందని పేర్కొంది. ఎప్పటినుంచో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి మాత్రం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

ఈ లేఖ అయోమయానికి తెరలేపింది. ప్రస్తుతం స్వస్థలాలకు తరలివెళ్లడానికి బయలుదేరిన వలస కార్మికుల్లో చాలామంది పనుల కోసం వేర్వేరు నగరాలకు వచ్చి అక్కడ తాత్కాలికంగానో, శాశ్వతంగానో నివాసం ఏర్పరుచుకున్నవారే. వీరిలో లాక్‌డౌన్‌ సమయంలో వచ్చి ఇరుక్కుపోయినవారు చాలా కొద్దిమందే. ఈ కోవలోకి ఎక్కువగా తీర్థ యాత్రికులు, పర్యాటకులు వస్తారు. వేర్వేరు రాష్ట్రాల్లో వలస కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. వీరంతా ఊళ్లకు వెళ్లిపోతే సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్యకలాపాలకు కూలీలు, కార్మికులు దొరకడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ తన పాత ఉత్తర్వులపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం అయోమయాన్ని సృష్టించింది.

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్రాలకు కూలీలు బస్సుల్లో వెళ్లడం వీలుకాదు. తాజా లేఖతో రైళ్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు ముందుకు రాకపోతే కూలీల తరలింపు సాధ్యం కాదు. స్వగ్రామాలకు వెళ్లిపోతామని కూలీలు పట్టుపడుతుండడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చూడండి:- '90శాతం నిండితేనే శ్రామిక్‌ రైళ్లు నడపాలి'

Last Updated : May 4, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.