ETV Bharat / bharat

'90శాతం నిండితేనే శ్రామిక్‌ రైళ్లు నడపాలి' - శ్రామిక్ రైళ్లకు నిబంధనలు

వలస కూలీల తరలింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. శ్రామిక్​ రైళ్లలో ప్రారంభ స్టేషన్​లోనే 90 శాతం సీట్లు నిండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. 500 కిలో మీటర్ల పైబడిన దూరాలకు నాన్​స్టాప్​గా రైళ్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

guidelines for special trains
ప్రత్యేక రైళ్లపై కేంద్రం మార్గదర్శకాలు
author img

By

Published : May 4, 2020, 6:50 AM IST

కనీసం 90% సీట్లు నిండితేనే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. లాక్‌డౌన్‌తో దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీల కోసం రాష్ట్రాల వినతి మేరకు ఈ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. వీటిపై ఆదివారం జోనల్‌ రైల్వేలకు కొన్ని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వీటి ప్రకారం.. ఈ రైళ్లలో వెళ్లాల్సిన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించి, వారికి టికెట్లను అందజేసి, ఆ మేరకు ధరను వసూలు చేసి మొత్తం సొమ్మును రైల్వేకు జమ చేయాల్సి ఉంటుంది.

మధ్యలో ఆగకూడదు

'అనుమతి పొందినవారే ఈ రైళ్లలో ప్రయాణించేలా ప్రారంభ స్టేషన్లో తగినంత భద్రతను రాష్ట్రాలు సమకూర్చాలి. సరైన టికెట్‌ ఉన్నవారే స్టేషన్లో ప్రవేశించేలా చూడాలి. సాధారణంగా శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు 500 కి.మీ. పైబడిన దూరాలకు నాన్‌స్టాప్‌గా నడవాలి. మార్గమధ్యంలో మరే స్టేషన్లో ఆగకూడదు. మధ్య బెర్తుల్లో ఎవరూ లేకుండా సామాజిక దూరం పాటిస్తూ ఒక్కో రైలు సుమారు 1200 మంది ప్రయాణికులను తీసుకువెళ్తుంది. 90%పైగా సీట్లు ప్రారంభ స్టేషన్లో నిండేలా రాష్ట్రాలు ప్రణాళిక వేసుకోవాలి' అని రైల్వేశాఖ పేర్కొంది. ఆహార పొట్లాలు, తాగునీటిని ప్రారంభ స్టేషన్లలోనే ప్రయాణికులకు అందించాలని తెలిపింది. '12 గంటలకు పైబడిన ప్రయాణమైతే రైల్వే తరఫున ఒక భోజనాన్ని సమకూరుస్తాం. నిబంధనల్ని ఏమాత్రం ఉల్లంఘించినా రైళ్లను ఉపసంహరించుకుంటాం' అని స్పష్టంచేసింది.

టికెట్‌ వసూలు సిగ్గుచేటు: అఖిలేశ్‌

వలస కూలీల నుంచి టికెట్‌ వసూలు చేయడం సిగ్గుచేటైన విషయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి:నేటి నుంచే లాక్​డౌన్ 3.0.. జోన్లవారీగా సడలింపులివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.