ETV Bharat / bharat

లాక్​డౌన్​ 2.0: కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ఇవే...

లాక్​డౌన్​ రెండో దఫా అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. పలు నిబంధనలను మరింత కఠినతరం చేయగా.. కొన్నింటిలో మాత్రం సడలింపులు చేసింది. ఏప్రిల్​ 20 నుంచి కొన్ని ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.

CENTER ANNOUNCES GUIDELINES FOR 2ND PHASE LOCKDOWN IN INDIA
లాక్​డౌన్​ 2.0కు మార్గదర్శకాలివే..
author img

By

Published : Apr 15, 2020, 9:58 AM IST

Updated : Apr 15, 2020, 11:43 AM IST

కరోనా నియంత్రణే లక్ష్యంగా లాక్​డౌన్​ను మే 3 వరకు కొనసాగించడానికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఏప్రిల్​ 20 నుంచి కొన్ని నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ, మరికొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటి ప్రకారం...

మే 3 వరకు...

  • అంతర్రాష్ట్ర, అంతర్​ జిల్లాల మధ్య ప్రజా రవాణా నిషేధం అమల్లో ఉంటుంది.
  • మెట్రో, బస్సు సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగుతాయి.
  • సినిమా హాళ్లు, షాపింగ్​ మాల్స్, జిమ్​లు, స్పోర్ట్ కాంప్లెక్స్​లు, ఈత కొలనులు, బార్లు మూసే ఉంచాలి.
  • విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రైళ్లు బంద్.
  • బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా.
  • అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు.
  • హాట్​స్పాట్​ ప్రాంతాల్లో నిత్యావసరాలు మినహా అన్ని రకాల రవాణాలపై నిషేధం.
  • నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

ఆరోగ్య విభాగం...

  • ఆసుపత్రులు, నర్సింగ్​ హోంలు, క్లీనిక్స్​, టెలిమెడికల్​ సదుపాయలు అందుబాటులో ఉంటాయి.
  • డిస్పెన్సరీలు, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయి.
  • మెడికల్​ ల్యాబొరేటరీలు, రీసర్చ్​ ల్యాబ్​లు ఉంటాయి.
  • మందులు, వైద్య పరికరాల తయారీ విభాగాలు తెరిచే ఉంటాయి.

వ్యవసాయం...

అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన​ కార్యకలాపాలు సాగుతాయి. అవి...

  • రైతులు చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలు.
  • వ్యవసాయ ఉత్పత్తులతో సంబంధం ఉండే సంస్థలు.
  • వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే మండీలు.

ఆర్థిక విభాగం...

  • ఆర్​బీఐ, ఆర్​బీఐ అనుసంధాన సంస్థల కార్యకలాపాలు సాగుతాయి.
  • బ్యాంకుల శాఖలు, ఏటీఎంలు తెరిచే ఉంటాయి.
  • ఐఆర్​డీఐఏ, బీమా కంపెనీలు పనిచేస్తాయి.

ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతి...

లాక్​డౌన్​ వల్ల ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్​ 20 నుంచి కొన్ని ప్రత్యేక కార్యకలాపాలకు అనుమతినిచ్చింది కేంద్రం. వీటి అమలుకు ముందే కేంద్రపాలిత, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కార్యాలయాలు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు పని ప్రదేశం మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.

  • రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, భవనాలు, పరిశ్రమలు వంటి నిర్మాణాలకు అనుమతి. అయితే ఇప్పటికే ఉన్న కూలీలతోనే పనులు చేసుకోవాలని, బయట నుంచి ఎవరిని తీసుకురాకూడదని నిబంధన.
  • అత్యవసర సమయాల్లో ప్రైవేటు వాహనాలకు అనుమతి.

కార్యాలయాలు...

  • రక్షణ, సీఆర్​పీఎఫ్​, ఆరోగ్య, విపత్తు నిర్వహణ, ఇతర మంత్రిత్వశాఖలు వాటి పరిధిలోని కార్యాలయాలు, పోలీసు, హోంగార్డు, పౌర రక్షణ, అగ్నిమాపక కార్యాలయాలు తెరుచుకునే ఉంటాయి.
  • ఈ కార్యాలయాల్లో డిప్యూటీ సెక్రటరీ స్థాయి, అంతకు మించిన ఉన్నతాధికారులు 100శాతం హాజరవ్వాలి. కానీ 33శాతం సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంది.

ఇదీ చూడండి:- 'ఆ 350 జిల్లాల్లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు'

Last Updated : Apr 15, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.