ఈసారి అమెరికా ఎన్నికలు తమిళనాడులోని రెండు గ్రామాలకు అత్యంత ప్రత్యేకంగా నిలిచాయి. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ఖి కమలా హారిస్ విజయమే దీనికి కారణం. కమలా హారిస్ అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామాలు తమిళనాడులోని తిరువారూర్ జిల్లాల్లో ఉన్నాయి.
ఆమె తాతయ్య పి.వి.గోపాలన్ స్వస్థలం తుళసేంద్రపురం కాగా అమ్మమ్మ రాజమ్ ఇక్కడి పైంగనాడువాసి. మాజీ దౌత్యవేత్త పి.వి.గోపాలన్ పెద్ద కూమార్తె శ్యామల సంతానమే కమలా హారిస్. ఆమె విజయంతో రెండు గ్రామాల ప్రజలు దీపావళికి ముందే సంబరాలు చేసుకోవాలని ఏర్పాటు చేశారు. మన్నార్గుడి నుంచి తుళసేంద్రపురం, పైంగనాడు వెళ్లే రహదారులలో ఫ్లెక్సీలతో పాటు గోడపత్రికలు అంటించారు.
- ఇదీ చూడండి: బైడెన్ విజయానికి కారణాలు ఇవే..