సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం తన విజయానికి ప్రధాన కారణమన్నారు సీబీఎస్ఈ టాపర్ హన్సికా శుక్లా. సీబీఎస్ఈలో 500 గాను 499 మార్కులతో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకును ఆమె సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆమె చదువుతున్నారు.
ఆంగ్లంలో కోల్పోయిన ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే బాగుండేదన్నారు హన్సిక. తానెప్పుడూ ట్యూషన్లకు వెళ్లలేదని, క్రమశిక్షణగా ఉంటూ, పాఠశాలలో చెప్పే అన్ని విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఆంగ్లం మినహా మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు సాధించారు హన్సిక.
"మాటలు రావట్లేదు.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు న్యాయం చేశాను. నాకు సైకాలజీలో పీహెచ్డీ చేయాలని ఆసక్తి. అందుకే ఆ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నా. రెండేళ్లుగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ కోసం చదవాలని ఆసక్తి పెరిగింది. మార్కుల విషయానికి వస్తే.. 499 రావాలని నేను చదవలేదు. మొత్తం సాధించేయాలని భావించాను."
-హన్సిక శుక్లా, సీబీఎస్ఈ టాపర్
ఇదీ చూడండి: ఎందరికో స్ఫూర్తి: గోమతి మరిముత్తు గాథ