సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, పన్నెండు తరగతుల ప్రశ్నపత్రాల నమూనాలో మార్పులను చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల్లో సృజనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనల్ని పెంచడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. 2023 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది.
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా-అసోచామ్ నిర్వహించిన పాఠశాల విద్యా సదస్సులో సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి ఈ ప్రతిపాదనను తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసకున్నట్లు వెల్లడించారు.
"ప్రస్తుతం ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 20 శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 10 శాతం ప్రశ్నలు సృజనాత్మకతపై ఉంటాయి. 2023 నాటికి 10, 12 తరగతుల ప్రశ్నాపత్రాలు సృజనాత్మక, వినూత్న విమర్శనాత్మక సమాధానాలను కోరేలా ఉంటాయి."
-అనురాగ్ త్రిపాఠి, సీబీఎస్ఐ కార్యదర్శి.
వొకేషనల్ సబ్జెక్ట్..
ప్రస్తుత విద్యారంగంలో ఒకేషనల్ సబ్జెక్ట్స్ ప్రాముఖ్యాన్ని వివరించారు త్రిపాఠి. సమాజంలో ఉపాధి, స్థిరత్వం లేకపోవడం వల్ల ఈ వొకేషనల్ సబ్జెక్ట్స్కు ప్రాధాన్యం తగ్గుతుందని అన్నారు. వొకేషనల్, ప్రధాన సబ్జెక్టుల మధ్య అంతరాన్ని తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'మహా' మజా: డిసెంబరు 1 కాదు.. ఈనెల 28నే ఠాక్రే ప్రమాణం