ETV Bharat / bharat

10, 12వ తరగతి పరీక్షలకు 15 వేల సెంటర్లు

జులై 1 నుంచి జరగనున్న 10,12వ తరగతి పరీక్షలను... సీబీఎస్ఈ 15 వేల పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించడమే కాక, వారికి ప్రయాణ దూరాన్ని కూడా తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసకున్నట్లు స్పష్టం చేసింది.

CBSE to conduct remaining Class 10, 12 board exams at 15,000 centres across country
10, 12వ తరగతి పరీక్షలకు 15 వేల సెంటర్లు
author img

By

Published : May 25, 2020, 3:41 PM IST

దేశవ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న 10, 12వ తరగతి పరీక్షల కోసం.. సీబీఎస్​ఈ 15వేల కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్​ పోఖ్రియాల్​ వెల్లడించారు.

జులై 1 నంచి జరగనున్న ఈ పరీక్షల్లో.. విద్యార్థులు భౌతిక దూరం పాంటించేందుకు, వారి ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

కొవిడ్​ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 25న విధించిన లాక్​డౌన్​తో వాయిదా పడిన పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు నిర్వహించేందుకు సిద్ధమైంది సీబీఎస్​ఈ.

గతంలో 3వేల కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. కానీ ఇప్పుడు 10, 12వ తరగతుల పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

రమేష్ పోఖ్రియాల్​, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి

విద్యార్థులు ఇతర పరీక్షా కేంద్రాల్లో కాకుండా సొంత పాఠశాలలోనే పరీక్షలకు హాజరవుతారని ఇదివరకే మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. అంతే కాకుండా, కంటైన్​మెంట్​ జోన్​లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయరాదని హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్జామ్​ హాల్స్​కు విద్యార్థులు చేరుకునేందుకు రవాణా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది.

ఇదీ చూడండి:సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.