జులై 1-15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు పేర్కొంది. సీబీఎస్ఈ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై శుక్రవారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం.
పరీక్షకు హాజరవ్వాలా లేక ఇంటర్నల్ మార్కుల ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలో నిర్ణయం తీసుకునే అధికారం విద్యార్థులకే ఇచ్చింది సీబీఎస్ఈ.
ఐసీఎస్ఈ బోర్డు కూడా 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే విద్యార్థులకు తర్వాత పరీక్షలు రాసే అవకాశం మాత్రం బోర్డు ఇవ్వట్లేదని చెప్పింది.