నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో భాజపా నేత ముకుల్ రాయ్‌ను నేడు విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో ముకుల్ రాయ్‌ను విచారించే అవకాశముంది. తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముకుల్ రాయ్ గతేడాది నవంబర్‌లో భాజపాలో చేరారు.
2016 ఎన్నికల సమయంలో నారదా ఛానెల్ ఓ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఇందులో ఓ కంపెనీ ప్రతినిధుల నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు.. ఓ ఐపీఎస్ అధికారి డబ్బు తీసుకుంటున్నట్లుగా ఉంది. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించే నాటికి ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి ఎస్ఎమ్హెచ్ మిర్జాను సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది.
- ఇదీ చూడండి: ఉగ్రకుట్ర: ఆ దేశం నుంచి వచ్చినవారే టార్గెట్!