'పిలాటస్' విమానాల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై పలువురు వైమానికదళ అధికారులు, రక్షణ మంత్రిత్వశాఖ అధికారులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. వివాదాస్పద ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీపైనా అభియోగాలు నమోదు చేసింది.
2009లో 75 పిలాటస్ బేసిక్ ట్రైనర్ విమానాలను స్విట్జర్లాండ్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం జరిగింది. అయితే ఇందులో భారీగా అవినీతి జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ నివాసం, కార్యాలయంల్లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఈ ఒప్పందంలో రూ.339 కోట్ల విలువైన అక్రమ చెల్లింపులను ప్రోత్సహించిన స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ సంస్థపైనా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
ఇదీ చూడండి: నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి