ETV Bharat / bharat

అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేశ్​కు క్లీన్​చిట్ - ఎన్నికల

సమాజ్​వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్​ యాదవ్​, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​కు భారీ ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వీరిద్దరికి క్లీన్​చిట్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో సీబీఐ పేర్కొంది.

అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేశ్​కు క్లీన్​చిట్
author img

By

Published : May 21, 2019, 12:25 PM IST

సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్​, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరిద్దరికీ సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు వారిపై నమోదైన కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

ములాయం, అఖిలేశ్​లు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఎలాంటి ఆధారాలులేవని తెలిపింది సీబీఐ. వీరిద్దరూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారని 2005లో విశ్వనాథ్‌ చతుర్వేది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ములాయం, అఖిలేశ్​పై విచారణ చేపట్టాలని 2007లో సీబీఐని ఆదేశించింది.

కేసు పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 11న సీబీఐని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా ప్రమాణపత్రం దాఖలు చేసిన సీబీఐ... ములాయం, అఖిలేశ్​ అక్రమాస్తులపై ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది. 2013లోనే ఆ కేసును ముగించినట్లు వివరించింది.

Kochi (Kerala), May 21 (ANI): A man from Kerala's Kochi has been growing 40 varieties of mangoes on his rooftop. What started as a hobby for Puthanparambil Joseph Francis, a technician by profession, has now become a full-time passion for mangoes. He initially grafted a single mango tree for experimentation, and after tasting success, Francis now owns multiple varieties of mangoes which he said are sweeter than the ones available in market.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.