ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఇందుకోసం 20 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే కేంద్ర ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందం ఘటన స్థలానికి చేరుకుంది. ప్రమాదంపై ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు నిపుణులు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారు మాదిరి.. మరో కారుతో ఘటన జరిగిన తీరును పునరావృతం చేసే పనిని ప్రారంభించారు.
లఖ్‌నవూలో విచారణ ప్రారంభించిన ఐదుగురు సభ్యుల బృందం సహాయం తీసుకోనుంది ప్రత్యేక బృందం.
ఇదీ చూడండి: 'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'