ETV Bharat / bharat

పాక్​ కుట్ర కోణాన్ని విస్మరించిన సీబీఐ - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

బాబ్రీ కేసు తీర్పు సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ప్రత్యేక న్యాయస్థానం. బాబ్రీ మసీదును కూల్చివేసి మత కలహాలు రేకెత్తించటానికి పాక్​ నిఘా సంస్థ కూడా పని చేయొచ్చనే సమాచారం ముందుగానే అందినా సీబీఐ ఆ అంశంపై దర్యాప్తు చేయలేదని పేర్కొంది. నిందితులపై తగిన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం సహా పాక్​ కోణాన్ని విస్మరించిందని తెలిపింది.

CBI did not probe Pak role in Babri case
పాక్​ కుట్ర కోణాన్ని విస్మరించిన సీబీఐ
author img

By

Published : Oct 2, 2020, 6:50 AM IST

బాబ్రీ మసీదును కూల్చివేసి దేశంలో మత కలహాలు రేకెత్తించడానికి పాకిస్థాన్​ నిఘా సంస్థ కూడా ప్రయత్నించవచ్చనే రహస్య సమాచారం ముందుగానే అందినా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆ అంశంపై దర్యాప్తు చేయలేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న 32 మంది ప్రముఖులు నిర్దోషులని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్​.కె.యాదవ్​ బుధవారం తీర్పు వెలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సీబీఐ తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతో పాటు పాక్​ కోణాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. విచారణ జరిపి, కూల్చివేతలో పాక్​ పాత్ర లేదని చెప్పే కీలకాంశాన్ని వదిలేయడం వల్ల కేసు బలహీనపడిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీబీఐ ఆ కోణాన్ని పరిశీలించి ఉంటే కేసులో నేరపూరిత కుట్ర కోణాన్ని న్యాయవ్యవస్థ సమీక్షించి ఉండేదని చెప్పారు.

పేలుడు పదార్థాలు వస్తున్నాయనే సమాచారమూ ఉంది

"1992 డిసెంబరు 6న పాక్​ నిఘా సంస్థకు చెందిన వ్యక్తులు అయోధ్య ప్రజలతో కలిసిపోయి, పేలుడు పదార్థాలతో గానీ ఇతర మార్గాల్లో గానీ వివాదాస్పద కట్టడానికి నష్టం కలిగించవచ్చనే సమాచారం స్థానిక నిఘా విభాగం(ఎల్​ఐయూ) నివేదికలో ఉంది. కరసేవకు అంతరాయం కలిగించి, యూపీలో, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రకు పాల్పడవచ్చని చెప్పే సమచారంపై యూపీ ఐజీ సంతకం చేశారు. పాకిస్థాన్​ నుంచి దిల్లీ మీదుగా అయోధ్యకు పేలుడు పదార్థాలు రవాణా అయ్యాయనే నివేదికలూ ఉన్నాయి. జమ్ముకశ్మీర్​లోని ఉధంపుర్​ నుంచి దాదాపు 100 మంది సంఘ విద్రోహ శక్తులు కరసేవకుల ముసుగులో అయోధ్యకు వస్తున్నట్లు నిఘా నివేదికల్లో ఉంది. దీనిని అన్ని భద్రత సంస్థలకు రాతపూర్వకంగా యూపీ హోంశాఖ పంపించింది. అంతటి కీలక వివరాలున్నా దానిపై దర్యాప్తు మాత్రం జరగనేలేదు" అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనేకమంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఒకదానికొకటి పొసగడం లేదని తీర్పులో రాశారు.

పాక్​ విమర్శల్ని తోలిపుచ్చిన కేంద్రం..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందితుల్ని నిర్దోషులుగా కోర్టు ప్రకటించటంపై పాకిస్థాన్​ చేసిన విమర్శల్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 'నిర్బంధ చర్యల ద్వారా ప్రజల, న్యాయస్థానాల గొంతు నొక్కేసే వ్యవస్థ ఉన్నవారికి' ప్రజాస్వామ్య విలువల్ని, న్యాయ నిబంధనల్ని అర్థ చేసుకోవడం కష్టమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

కూల్చివేత పని కాంగ్రెస్​దే: కటియార్​

బాబ్రీ మసీదు కూల్చివేత పని కాంగ్రెస్​దేనని, రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలను కూల్చివేయడానికి అప్పట్లో అలా చేసిందని భాజపా నేత వినయ్​ కటియార్​ ఆరోపించారు. కట్టడాన్ని కూల్చాలని తామెప్పుడూ అనుకోలేదని చెప్పారు. గుర్తుతెలియని శక్తులు కరసేవకుల ముసుగులో కలిసిపోయి, అందరినీ రెచ్చగొట్టి, కూల్చివేతకు దిగాయని, పరిస్థితి ఎలా అదుపుతప్పిందో తమకు అర్థం కాలేదని ఆయనొక వార్తాసంస్థకు తెలిపారు. మసీదు కూల్చివేతలో కాంగ్రెస్​ ప్రమేయంపై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. మసీదును కూల్చకపోతే మందిర నిర్మాణం సాధ్యమయ్యేది కాదని, అయితే దానికి ఎంచుకున్న సమయం సరికాదని చెప్పారు. కాశీ, మథుర వివాదాలనూ హిందువులకు అనుకూలంగా పరిష్కరించాలని చెప్పారు.

ఇదీ చూడండి: 'బాబ్రీ' కేసు: 28 ఏళ్లలో మలుపులెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.