ETV Bharat / bharat

పశువుల అక్రమ రవాణా.. బీఎస్​ఎఫ్​ అధికారిపై కేసు

పశువుల అక్రమ రవాణా కేసులో సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)కు చెందిన ఓ అధికారితో పాటు మరో ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. భారత్​, బంగ్లాదేశ్​ సరిహద్దుల వెంబడి వీరు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

author img

By

Published : Sep 23, 2020, 10:49 PM IST

CBI books BSF officer, 3 others over cattle smuggling at B'desh border, raids 15 locations
పశువుల అక్రమ రవాణా-బీఎస్​ఎఫ్​ అధికారిపై కేసు

పశువుల అక్రమ రవాణాకు సంబంధించి సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ అధికారితో పాటు మరో ముగ్గురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి పశువుల అక్రమ రవాణాకు సంబంధించి.. 36వ బీఎస్‌ఎఫ్ దళానికి చెందిన మాజీ కమాండెంట్ సతీష్ కుమార్‌ సహా ఇనాముల్ హక్, అనారుల్ షేక్, మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. కుమార్ ప్రస్తుతం రాయ్‌పుర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.

కోల్‌కతా, ముర్షిదాబాద్, గాజియాబాద్​, అమృత్‌సర్‌, రాయ్‌పుర్ సహా మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.