దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆమ్ఆద్మీ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా ప్రత్యేక అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
జీఎస్టీకి సంబంధించిన ఓ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా మనీశ్ సిసోడియా ఓఎస్డీ గోపాల్ కృష్ణ మాధవ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సిసోడియా హస్తం లేదని తెలుస్తుండగా... దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మనీశ్ సిసోడియాకు ప్రత్యేక అధికారిగా 2015లోనే మాధవ్ నియామకమయినట్లు సమాచారం.
ఇదీ చదవండి: అండర్ 19 కప్పు కోసం భారత్-బంగ్లాదేశ్ ఢీ