చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు
- గంటసేపు హైడ్రామా తర్వాత అదుపులోకి తీసుకున్న సీబీఐ
- చిదంబరంను కారులో తరలిస్తున్న సీబీఐ అధికారులు
21:47 August 21
#WATCH P Chidambaram taken away in a car by CBI officials. #Delhi pic.twitter.com/nhE9WiY86C
— ANI (@ANI) August 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH P Chidambaram taken away in a car by CBI officials. #Delhi pic.twitter.com/nhE9WiY86C
— ANI (@ANI) August 21, 2019
#WATCH P Chidambaram taken away in a car by CBI officials. #Delhi pic.twitter.com/nhE9WiY86C
— ANI (@ANI) August 21, 2019
చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు
21:41 August 21
ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్టు?
21:14 August 21
చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా
20:40 August 21
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విషయమై చిదంబరం వివరణ
20:19 August 21
మీడియా ముందుకు చిదంబరం
నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎవరూ ఊహించని విధంగా మీడియా ముందుకొచ్చారు. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఎన్‌ఎక్స్ కేసులో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.
14:48 August 21
చిదంబరానికి కోర్టులో చుక్కెదురు.... అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు చుక్కెదురైంది. చిదంబరం వేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
పిటిషన్లో లోపాలు
చిదంబరం తరపు న్యాయవాదులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే.
అరెస్టు తప్పదా?
ఇది చిదంబరానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈడీ లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ జరిగింది
2007లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో... ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు రూ.305 కోట్ల విదేశీ నిధులు అందాయి. అయితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్టు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా సీబీఐ 2017 మే 15న ఐఎన్‌ఎక్స్ మీడియాపై కేసు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే మీడియా గ్రూపుపై 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నిన్న దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రెండుసార్లు చిదంబరం ఇంటికెళ్లినా ఆయన లేకపోవడం వల్ల వెనుదిరిగారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. వెంటనే తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
సుప్రీంలో బెయిల్ పిటిషన్
సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరం పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీం నిరాకరించింది.
కేంద్రంపై తీవ్ర విమర్శలు...
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యవహారంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను ఉపయోగించుకుని చిదంబరం వ్యక్తిత్వ హననానికి, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాహుల్.
సత్యం కోసం పోరాటం కొనసాగిస్తాం...
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ... చిదంబరానికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, ఆనందశర్మ కూడా చిదంబరానికి సంఘీభావం తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపే..
చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను చిదంబరం సమర్థంగా ఎదుర్కోగలరని ధీమా వ్యక్తంచేశారు.
14:32 August 21
చిదంబరం అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ

14:24 August 21
చిదంబరం కేసు విచారణ ఇవాళ లేనట్లే
చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాల కారణంగా విచారణకు అనుమతించని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
కోర్టు విచారణ జాబితాలో లేకుండా కేసు వాదనలు వినడం కుదరదని స్పష్టం చేసిన జస్టిస్ ఎన్.వి.రమణ
చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే
13:43 August 21
చిదంబరం ఎస్ఎల్పీ పిటిషన్లో లోపాలు
చిదంబరం తరఫున న్యాయవాదులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాలు. లోపాల కారణంగా విచారణకు అనుమతివ్వని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ. చిదంబరానికి తప్పని ఇక్కట్లు. లుక్అవుట్ నోటీసుల నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి అరెస్ట్‌పై ఉత్కంఠ
భోజన విరామ సమయంలో పరిశీలించనున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
13:36 August 21
చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్ష సాధింపే: స్టాలిన్
చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను చిదంబరం సమర్థంగా ఎదుర్కోగలరని స్పష్టం చేశారు.
12:53 August 21
కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణ
ఈడీ, సీబీఐల సహకారంతో చిదంబరం వ్యక్తిత్వ హననకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
వెన్నెముక లేని మీడియా కూడా ఇందుకు సహకరిస్తోందని ఆవేదన
12:39 August 21
సుప్రీంకోర్టులో సీబీఐ కేవియట్ పిటిషన్
సుప్రీంకోర్టులో సీబీఐ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి వేసిన వ్యాజ్యంపై తమ వాదనలు వినకుండా కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సీబీఐ కోరింది.
11:35 August 21
చిదంబరం ఫోన్ స్విచ్ ఆఫ్.. చివరగా లోధీ రోడ్లో..
చిదంబరం ఫోన్ స్విచ్ ఆఫ్. చివరగా లోధీ రోడ్లో లొకేషన్.
చిదంబరంపై ఈడీ లుక్ అవుట్ నోటీసు నేపథ్యంలో అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ
11:27 August 21
చిదంబరంపై ఈడీ లుక్అవుట్ నోటీసులు
చిదంబరంపై లుకౌట్ నోటీసులు జారీచేసిన ఈడీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు పెండింగ్‌లో చిదంబరం లీవ్ పిటిషన్ విచారణ
11:01 August 21
ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో చిదంబరం వ్యాజ్యం విచారణ
అయోధ్య కేసును విచారిస్తున్న జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం
భోజన విరామ సమయంలో చిదంబరం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
10:52 August 21
ప్రధాన న్యాయముూర్తి ధర్మాసనం వద్దకు చిదంబరం న్యాయవాదులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వద్దకు చిదంబరం న్యాయవాదులు
మరోవైపు అయోధ్య కేసు విచారణ ప్రారంభించిన సుప్రీం ధర్మాసనం
10:44 August 21
సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు
చిదంబరం పిటిషన్‌పై తక్షణ ఆదేశాలు ఇవ్వలేనని తేల్చిచెప్పిన జస్టిస్ ఎన్.వి.రమణ
పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పరిశీలనకు పంపిస్తానని వెల్లడి
10:43 August 21
చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది. కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ థంఖా న్యాయస్థానానికి చేరుకున్నారు.
10:32 August 21

సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికాసేపట్లో సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది, పార్టీ సహచరుడు కపిల్ సిబల్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం వాదనలు వినిపించనుంది.
10:16 August 21
చిదంబరం భవితవ్యం ఎటువైపు? సుప్రీంలో కాసేపట్లో వాదనలు
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భవితవ్యం కాసేపట్లో తేలనుంది. సీబీఐ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.