ETV Bharat / bharat

కన్సార్షియంల నుంచి రుణాలు-రూ.754 కోట్ల మోసం - case has been registered against BSP MLA Vinay Shankar Tiwari

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీపై కేసు నమోదైంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని రూ.754కోట్లు మోసం చేశారన్న ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

case has been registered against BSP MLA Vinay Shankar
కన్సార్షియంల నుంచి రుణాలు-రూ.754 కోట్ల మోసం
author img

By

Published : Oct 20, 2020, 7:33 AM IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని రూ.754కోట్లు మోసం చేశారన్న ఆరోపణతో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య రిటా, గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ డైరెక్టర్‌ అజిత్‌ పాండేలపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

లఖ్‌నవూలోని 'గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌', నొయిడాలోని మరో కంపెనీ 'రాయల్‌ ఎంపైర్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌'లతో పాటు తివారీ, పాండే ఇళ్లలో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. అధికారుల వివరాల ప్రకారం.. రోడ్లు, వంతెనలు నిర్మించే గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి రుణ సదుపాయాలను ఉపయోగించుకుంది. 'ట్రస్ట్‌, రిటెన్షన్‌ అకౌంట్‌' ద్వారా ఈ కంపెనీ లావాదేవీలు నిర్వహించాల్సి ఉండగా.. సంస్థ ఆ విధంగా చేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అనంతరం సంస్థ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గైర్‌ తెలిపారు.

ఇదీ చూడండి: హజ్‌ యాత్రపై తొలగని అనిశ్చితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.