ఛత్తీస్గఢ్ సూరజ్పుర్లోని ప్రతాప్పుర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇతర ఏనుగులతో పోరాటం చేయడం వల్లనే ఈ గజరాజు మరణించినట్లు భావిస్తున్నారు.
"కొద్ది రోజులుగా గణేశ్పుర్ పరిసర ప్రాంతాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ మందలో కనీసం 18 ఏనుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గుంపులోని మగవాటితో చేసిన పోరాటంలోనే ఈ ఏనుగు మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. చుట్టూ ఉన్న చెట్లు కూడా విరిగిపడి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా పోస్టుమార్టం తరువాత ఏనుగు మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి."
- మనోజ్ విశ్వకర్మ, ప్రతాప్పుర్ ఎస్డీఓ
20 రోజుల క్రితం కంజ్వారీ ప్రాంతంలో ఇలానే ఓ ఏనుగు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఉన్న ఓ తుపాకీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: ఇరుకైన దారిలో: జాలువారే సెలయేరు.. జారితే బేజారు