ETV Bharat / bharat

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు - UP NEWS

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్​ను పోలీసులు రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతయ్యింది.

Car crashes into canal in Ghaziabad
కాలువలోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Aug 8, 2020, 4:22 PM IST

Updated : Aug 8, 2020, 9:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో ఓ కారు ప్రమాదానికి గురైంది. బరేలీ నుంచి చండీగఢ్​ వెళుతున్న క్రమంలో గాజియాబాద్​లోని మసురీ ప్రాంతంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు ఆచూకీ గల్లంతయినట్లు పోలీసులు తెలిపారు.

" రాత్రి 12 గంటల సమయంలో కారు కాలువలో పడిపోయింది. అదే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నాను. నీటిలో చేతులు కనిపించటం వల్ల అందులోకి దూకి కారు డ్రైవర్​ను కాపాడాను. ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురు కారులోంచి బయటపడ్డారు. కానీ, ఆ తర్వాత వారు కనిపించలేదు. వారి కోసం గాలింపు చేపట్టాం."

- నరేశ్​ సింగ్​, పోలీసు అధికారి.

ఘటనా స్థలానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, స్థానిక పోలీసులు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రాత్రంతే అక్కడే ఉండి ఉదయం కారును వెలికితీశారు.

ఇదీ చూడండి: విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్​ నిలిపివేత

Last Updated : Aug 8, 2020, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.