ETV Bharat / bharat

'జాన్సన్​ పర్యటన రద్దు మా విజయమే'

author img

By

Published : Jan 7, 2021, 12:31 PM IST

గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. భారత్​ పర్యటన వాయిదా వేసుకోవడం తాము సాధించిన రాజకీయ విజయంగా పేర్కొన్నాయి కర్షక సంఘాలు. దీనిని మోదీ సర్కారుకు దౌత్యపరమైన ఓటమిగా అభివర్ణించాయి.

Cancellation of UK PM visit our victory, govt's 'defeat': Farmer unions
'జాన్సన్​ పర్యటన రద్దు మా విజయమే'

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భారత పర్యటన రద్దు చేసుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నాయి రైతు సంఘాలు. దీనిని ప్రభుత్వ ఓటమిగా అభివర్ణించాయి. బోరిస్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా తమకు మద్దతు లభిస్తుందని స్పష్టమైందని ప్రకటించుకున్నాయి.

"యూకే ప్రధాని భారత్​ పర్యటన రద్దు.. మేము సాధించిన రాజకీయ విజయం, మోదీ సర్కారుకు దౌత్యపరమైన ఓటమి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక సంస్థల మద్దతు మాకు లభిస్తుంది. రైతుల ఉద్యమం ఇప్పుడు ప్రజాఉద్యమంగా మారబోతుంది" అని సంయుక్త కిసాన్​ మోర్చా ఓ ప్రకటనలో పేర్కొంది.

బోరిస్​ జాన్సన్​.. 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే బ్రిటన్​లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో తాను రాలేక పోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​ చేసి చెప్పారు జాన్సన్​.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధాని భారత పర్యటన​ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.