సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత భూభాగంలోకి చైనా సైనికుడు ఒక్కరు కూడా అడుగు పెట్టలేదని చెప్పగలరా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని లేవనెత్తారు.
-
Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020Can GOI please confirm that no Chinese soldiers have entered India?https://t.co/faR5fxEqQO
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2020
"చైనా సైనికులెవ్వరూ భారత్‌లోకి ప్రవేశించలేదని ప్రభుత్వం దయచేసి చెప్పాలి" అని ట్వీట్ చేశారు రాహుల్. జూన్ 6న భారత్-చైనా ఉన్నత స్థాయి సైనిక సమావేశం నిర్వహించి సరిహద్దు సమస్యపై చర్చించనున్నారని పత్రికలో వచ్చిన వార్తను ట్వీట్‌కు జతచేశారు. సరిహద్దులో చైనా భారీగా బలగాలను మోహరించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని అందులో ఉంది.
గత నెలలో నిర్వహించిన మీడియా సమావేశాల్లోనూ చైనాతో సరిహద్దు వివాదంపై కేంద్రాన్ని తప్పుబట్టారు రాహుల్. సంక్షోభ సమయంలో కేంద్రం ఈ విషయంపై మౌనంగా ఉంటే అనిశ్చితి నెలకొంటుందన్నారు. సరిహద్దులో వాస్తవ పరిస్థితి గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నేపాల్ విషయంలో ఏం జరిగిందో, లద్దాఖ్ సరిహద్దులో ఏం జరుగుతుందో స్పష్టత ఇవ్వాలన్నారు.