ETV Bharat / bharat

భారత్​- చైనా సరిహద్దుల్లో 'కెమెరా' యుద్ధాలు - india china war

కఠినమైన పరిస్థితులు ఉండే వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​, చైనా.. నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాయి. భారత సైన్యం కదలికలను గుర్తించేందుు చైనా శక్తిమంతమైన కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్​ కూడా కెమెరా నిఘాను సమర్థంగా వినియోగిస్తోంది. ఇటీవల పాంగాంగ్​ సరస్సు ప్రాంతంలో చైనా ఆక్రమణలకు దిగిన వేళ.. వారి కెమెరాలను ధ్వంసం చేసి బుద్ధి చెప్పాయి భారత బలగాలు.

Camera wars
భారత్​- చైనా
author img

By

Published : Sep 2, 2020, 2:29 PM IST

భారత్- చైనా వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహించడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. ప్రాంత విస్తీర్ణం, సంక్లిష్ట భూభాగం, విపరీత వాతావరణం.. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అయినా... ప్రస్తుతం భారత్- చైనా ఉద్రిక్తతల నడుమ రెండు దేశాల సైన్యాలు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సవాళ్లను అధిగమించేందుకు నిఘా వ్యవస్థలో మరో కోణాన్ని ఆశ్రయించాయి రెండు దేశాలు.

సరిహద్దుల్లోని ఎత్తయిన ప్రాంతాల్లో నిఘా కెమెరాలపై దృష్టి సారించాయి భారత్​, చైనా. శత్రువు కదలికలను 24 గంటలూ గుర్తించేందుకు కీలకమైన ప్రాంతాల్లో కెమెరాలను అమర్చుతున్నాయి. ఆగస్టు 29-30 మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన సమయంలోనూ భారత సైన్యాలు వీటిపైనే దృష్టి పెట్టి దొంగ దెబ్బ తీయాలనుకున్న చైనాను పరుగులెత్తించినట్లు తెలుస్తోంది.

కెమెరాలే లక్ష్యంగా..

పాంగాంగ్​ సరస్సు సమీపంలోని హెల్మెట్​, బ్లాక్​ టాప్​ అని పిలిచే ఎత్తయిన ప్రాంతాల్లో చైనా బలగాలు అమర్చిన కెమెరాలను లక్ష్యంగా చేసుకున్నాయి భారత ప్రత్యేక సరిహద్దు దళాలు(ఎస్ఎస్​ఎఫ్). ఈ ప్రాంతాల్లో భారత సైన్యం కదలికలను గుర్తించేందుకు చైనా అమర్చిన కెమెరాలను ధ్వంసం చేసి డ్రాగన్​కు తగిన రీతిలో జవాబిచ్చాయి.

ఇదీ చూడండి: చైనాకు షాక్​- భారత్ అధీనంలో కీలక ప్రాంతం​

ఈ ప్రాంతాలే కీలకం..

ఇలాంటి ఎత్తయిన ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయటం వల్ల కలిగే లాభాలను ఓ సీనియర్ సైనికాధికారి ఈటీవీ భారత్​కు వివరించారు.

"పాంగాంగ్​ సరస్సు దక్షిణ ఒడ్డుకు ఎడమవైపు ఉన్న ఎత్తయిన ప్రాంతాలు.. స్పంగూర్​ గ్యాప్​, హెల్మెట్​, బ్లాక్​ టాప్​. కైలాశ్ శ్రేణి ప్రారంభమయ్యే ప్రదేశానికి కుడివైపున రెజాంగ్​ లా, రిన్చెన్​ లా ఉన్నాయి. వీటి నుంచి చుట్టు పక్కన ప్రాంతాలను పూర్తిగా గమనించే ప్రదేశాల్లో శక్తిమంతమైన కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. ఇవి అక్కడి బలగాలకు అదనపు బలాన్ని చేకూర్చుతాయి."

- సీనియర్ సైనికాధికారి

చైనాకు ఇవే ఆధారం..

పీఎల్​ఏ సైనికులు నడవడానికి ఎక్కువగా ఇష్టపడరని సైనికాధికారి వెల్లడించారు. చిన్న దూరాలకు కూడా వాహనాలనే వినియోగిస్తారని, అందువల్ల వాళ్లు కెమెరాలపైనే ఎక్కువగా ఆధారపడతారని తెలిపారు. భారత సైన్యం గస్తీ నిర్వహించినప్పుడు కెమెరాల ఆధారంగా గుర్తించి.. వాహనాల్లో వచ్చి అడ్డుకుంటారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాంగాంగ్​లో భారత సైన్యం కెమెరాలను ధ్వంసం చేసి చైనాకు చెమటలు పట్టించిందని తెలిపారు.

ఇదీ చూడండి: హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

శక్తిమంతమైన కెమెరాలు..

చైనా సైన్యం ఉపయోగించే నైట్ విజన్​ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి. పూర్తి హెచ్​డీ సాంకేతికతతో రూపొందినవి. వీటి ప్రభావ పరిధి పగటి పూట 6 కి.మీ.. ఉంటే రాత్రి వేళల్లో 3 కి.మీ. దూరం వరకు నిఘా పెట్టగలవు. కఠినమైన వాతావరణం ఉండే ఇలాంటి ప్రాంతాల్లో మానవ రహిత డ్రోన్లు, శాటిలైట్​ నిఘా కన్నా ఇవి సమర్థంగా పనిచేస్తాయి.

భారత బలగాలు కూడా..

భారత సైన్యం కూడా కెమెరాల వినియోగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. చుమార్​లో భారత స్థావరాల వైపు నాలుగైదు వాహనాల్లో వస్తున్న పీఎల్​ఏ సైనికులను మన బలగాలు అడ్డుకున్నట్లు సమాచారం. ఇలా కెమెరాల ద్వారా ముందస్తుగా గుర్తించటం, చైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన సమయంలోనే అడ్డుకోవటం సాధ్యమవుతుంది.

(రచయిత- సంజీవ్ బారువా)

ఇదీ చూడండి: యుద్ధమేఘాలు- నివురుగప్పిన నిప్పులా నిర్మల హిమగిరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.