రాజస్థాన్ రాష్ట్ర జంతువు, ఎడారి ఓడగా పిలిచే ఒంటెలపై ఆ రాష్ట్రంలో ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. నెలల వ్యవధిలోనే మూడు సార్లు దాడులు జరిగాయి. తాజాగా చురూ జిల్లాలోని సర్దార్శహర్ ప్రాంతంలో తమ పొలంలోకి వచ్చిందనే అక్కసుతో ఒంటె కాలు నరికారు దుండగులు.
నడవలేని స్థితిలో ఉన్న ఒంటెను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్త స్రావం కావటం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందింది. సామాజిక మాధ్యమాల్లో ఒంటెకు సంబంధించిన వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటెపై గొడ్డలితో దాడి జరిగిందని తెలిపారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కఠిన చర్యలకు కేంద్ర మంత్రి ఆదేశం..
ఒంటెపై దాడిని తీవ్రంగా ఖండిచారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఒకే రోజు మూడు ఏనుగులు మృతి.. ఏం జరిగింది?